జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో హృదయ విదారక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. చెనాని ప్రాంతంలోని లడ్డా గ్రామంలో ఓ సంచిలో కుళ్ళిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఓ షాకింగ్ విషయం బయటపడింది. భర్తను భార్య, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దారుణంగా హత్య చేసినట్లు తేలింది. ఈ సంఘటన గురువారం జరిగింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
READ MORE: Ambati Rambabu: టీడీపీ నాయకుల హత్యలకు పిన్నెల్లికి ఏంటి సంబంధం?
పోలీసుల సమాచారం ప్రకారం.. లడ్డా గ్రామ సమీపంలో ఒక సంచి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని బ్యాగ్‌ను తెరిచి చూసింది. అందులో బాగా కుళ్ళిపోయిన ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత.. ఆ మృతదేహాన్ని చుల్నా-పంచారి నివాసి రవి కుమార్‌దిగా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం తరలించారు.
READ MORE: BrahMos missile: అడ్వాన్సుడ్” బ్రహ్మోస్ మిస్సైల్” తయారీ కోసం భారత్, రష్యా చర్చలు..
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో పోలీసులు మృతుడి భార్య నిషా దేవిని అనుమానించారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, నిషా దేవి, ఆమె వదిన కాంతా దేవి, నర్గెలా గ్రామ నివాసి జోగిందర్ అనే యువకుడిపై పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని కఠినంగా విచారించగా.. వారు నేరాన్ని అంగీకరించారు. ఇంట్లో జరిగిన గొడవ కారణంగా రవి కుమార్‌ను చంపడానికి కుట్ర పన్నినట్లు నిందితులు అంగీకరించారు. వీరు ముగ్గురూ కలిసి రవిని దారుణంగా హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులకు దొరికి పోయారు.
READ MORE: YV Subba Reddy: వైఎస్ జగన్‌పై పెట్టినవన్నీ అక్రమ కేసులే!