UP: అపార్ట్‌మెంట్స్‌లో పార్కింగ్ వివాదం.. సొసైటీ కార్యదర్శి ముక్కు కొరికిన వ్యక్తి (వీడియో)
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ పరిధిలో ఘటన
- అకస్మాత్తుగా రూపేంద్రపై దాడి చేసిన వ్యక్తి
- పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ పరిధి బితూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రతన్ ప్లానెట్ అపార్ట్‌మెంట్స్‌లో పార్కింగ్ విషయంపై గొడవ జరిగింది. ఈ చిన్న వివాదం భయంకరమైన మలుపు తిరిగింది. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో.. ఓ యువకుడు అపార్ట్‌మెంట్ కార్యదర్శి, రిటైర్డ్ ఇంజనీర్ ముక్కు కొరికాడు. ఈ వార్త ప్రస్తుతం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: VC Sajjanar: ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
పోలీసుల సమాచారం ప్రకారం.. ఫ్లాట్ యజమాని క్షితిజ్ తనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో వేరొకరి కారు పార్క్ చేయడాన్ని చూసి, అపార్ట్మెంట్ సొసైటీ కార్యదర్శి రూపేంద్రకు ఫోన్ చేసి చెప్పాడు. రూపేంద్ర కారును అక్కడి నుంచి తరలించమని గార్డుకు సూచించాడు. అయినా క్షితిజ్ వినలేదు.. అతడిని కిందకు రమ్మని కోరాడు. కిందికి వచ్చిన సొసైటీ కార్యదర్శిని క్షితిజ్ దుర్భాషలాడాడు. అకస్మాత్తుగా రూపేంద్రపై దాడి చేసి, అతని ముక్కును గట్టిగా కొరికాడు.
READ MORE: IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్‌లో ‘ఆపరేషన్ సింధూర్’ స్పెషల్.. వారికి బీసీసీఐ ఆహ్వానం
ఆ ఘటనను చూసి సమీపంలోని వ్యక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. గాయపడిన రూపేంద్రను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ సంఘటన మొత్తం అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. బాధితుడి కుమారుడి ఫిర్యాదు మేరకు.. పోలీసులు నిందితుడు క్షితిజ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా.. ఈ సంఘటన పట్టణ అపార్ట్‌మెంట్ సంస్కృతిలో పెరుగుతున్న పరస్పర శత్రుత్వం, ఉద్రిక్తతను మరోసారి హైలైట్ చేసింది.
READ MORE: Dil Raju: పవన్ మాటలతో ఏకీభవిస్తున్నా.. స్నాక్స్ రేట్లు తగ్గించాలి!
#कानपुर पार्किंग विवाद में रिटायर इंजीनियर की नाक चबा डाली..
अपार्टमेंट की सोसाइटी के सचिव और फ्लैट के मालिक के बीच हुआ विवाद,फ्लैट मालिक क्षितिज ने पहले थप्पड़ मारे फिर अचानक से नाक दांतों से काट लिया। #kanpur #sirfsuch #news pic.twitter.com/kA2fUOKXea
— ठाkur Ankit Singh (@liveankitknp) May 27, 2025
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!