హెచ్‌సీఏ అక్రమాలపై సంచలన విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిగింది. హెచ్‌సీఏ సెక్రటరీ ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచేజ్ పై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు నిర్ధారణ అయింది. టికెట్ల కోసం ఎస్‌ఆర్‌హెచ్ యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు తేలింది. ఇప్పటికే పది శాతం టికెట్లను ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రీగా ఇస్తోంది. మరో 10 శాతం టికెట్లు కావాలని యాజమాన్యంపై సెక్రటరీ ఒత్తిడి తెచ్చినట్లు ఎస్‌ఆర్‌హెచ్ తెలిపింది.
READ MORE: Nara Lokesh: సీఎం పదవిపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఫ్రీగా 10% టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని ఎస్ఆర్‌హెచ్ యజమాన్యం తేల్చి చెప్పింది. ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెడితే టికెట్లు ఇచ్చేందుకు ఒప్పుకుంది.. తనకు వ్యక్తిగతంగా 10% టికెట్లు కావాలని జగన్మోహన్ డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. ఎస్‌ఆర్‌హెచ్ టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్‌ల సందర్భంగా ఇబ్బందుల గురిచేశారు జగన్. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేశారు. ఎస్‌ఆర్‌హెచ్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా విజిలెన్స్ నివేదికలో నిర్ధారణ అయింది. కాగా.. హెచ్‌సీఏపై చర్యలకు విజిలెన్స్ ఆదేశించింది.
READ MORE: Manchu Brothers: కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ వెనుక ‘చరిత’.. ఆమెకు మనోజ్ థాంక్స్?