తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని, రాబోయే 22 ఏళ్లలో ఏపీని దేశంలో నెంబర్ వన్‌గా చేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ముందుగా ఆయన పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడారు.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. "ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ళ క్రితం ఇదే రోజు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాను. 41 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను. 9 ఏళ్ళు సమైక్యాంధ్ర సీయంగా, మొత్తంగా 14 ఏళ్ళకు పైగా సీఎంగా…
ముఖ్యమంత్రి స్పీచ్ అద్భుతంగా ఉందని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. రెండు గంటల 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ స్పీచ్‌పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి స్పీచ్‌లో అప్పులు, వడ్డీ లెక్కలు స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పారని కొనియాడారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. రెండు గంటల 25 నిమిషాల పాటు మాట్లాడారు. సీఎం రేవంత్ ప్రసంగంలో భాగంగా సోషల్ మీడియాలో పోస్టులపై కన్నెర్రజేశారు.
జనసేన పార్టీ 11ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏట అడుగు పెట్టింది. నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా నేడు కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. జనసేన 12 ఏళ్ల పండుగ వైభవంగా సాగుతోంది.. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేస్తారు. సభలో 90 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు..
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రజలు రంగుల్లో మునిగితేలుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుని ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. స్నేహితులు, సన్నిహితులు పాటలకు స్టెప్స్ వేస్తూ సందడి చేస్తున్నారు. అందరూ ఒక చోట చేరి కలర్ ఫుల్ రంగులను చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి రంగులు పూసుకుంటూ.. డ్యాన్సులు వేస్తూ... హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రెయిన్ డ్యాన్సులు, మడ్ డ్యాన్సులు లాంటి వెరిటీ ప్రోగ్రామ్ లతో ఈవెంట్లు నిర్వహిస్తున్నారు ఆర్గనైజర్లు.
మనం అన్ని పండుగలనూ ఆనందంగానే జరుపుకుంటాం. హోలీని మరింత సంబరంగా జరుపుకుంటాం. ఎందుకంటే అది వసంతాగమనానికి పీఠిక కాబట్టి. అది ప్రకృతి కొత్త అందాలు నింపుకున్నదనటానికి సూచిక కాబట్టి. ఆమని వచ్చే వేళ రంగురంగులతో ముస్తాబవుతున్న అవనిని చూసి మది మురిసిపోతుంది. ఆ మురిపెంలోనే రంగులు చల్లుకొనాలనిపిస్తుంది.
ప్రస్తుతం పాకిస్థాన్ అన్ని వైపుల నుంచి అవమానాలు ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్‌లో జరిగిన రైలు హైజాక్ సంఘటనపై ఒకవైపు రష్యా, ఆఫ్ఘనిస్తాన్ వంటి స్నేహపూర్వక దేశాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు, పాకిస్థాన్ వైఖరిపై భారత్ కూడా మండిపడింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్‌లో భారతదేశ ప్రమేయం ఉందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ చేస్తున్న ఈ నిరాధారమైన అర్థంలేని ప్రచారాన్ని భారతదేశం తీవ్రంగా తిరస్కరించింది.
గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. డిసెంబర్ 2022 లో 1388 పోస్ట్ భర్తీకి గ్రూప్ -3 నోటిఫికేషన్ విడుదలవగా.. 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) పరీక్ష రాశారు. ఫలితాలతో పాటే ఫైనల్ కీ, అభ్యర్థుల లాగిన్ ఐడీలకు OMR షీట్స్ కూడా పంపించారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/ లో…
దేశమంతటా అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. జనమంతా రంగుళకేళిలో తేలియాడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు వాటర్ గన్లను తీసుకుని రంగులు జల్లుకుంటూ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. కాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో మాత్రం 46 ఏళ్ల తర్వాత హోలీ ఘనంగా నిర్వహించారు. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా నగరంలోని కార్తికేయ ఆలయంలో హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు, హిందువులు ఒకరినొకరు గులాల్ పూసుకుంటూ.. సంబరాలు జరుపుకున్నారు.
దేశవ్యాప్తంగా నేడు హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో జనాల మధ్య పండుగను ఘనంగా జరుపుకున్నారు.