రేపు (శుక్రవారం మార్చి14)న ఆమిర్ ఖాన్ పుట్టిన రోజు. అయితే ఒక రోజు ముందుగానే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటుడు ఆమిర్ ఖాన్ ముంబైలోని న్యూస్ రిపోర్టర్లు, ఫొటో గ్రాఫర్లు, అభిమానులతో కలిసి పుట్టిన రోజు వేడుక జరుపుకున్నారు. అందరి ముందు కేక్ కోసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నెలల తరబడి ఊహాగానాల తర్వాత..
టాలీవుడ్ యాక్షన్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాలు తీసిన ఆది నటన పరంగా తండ్రి పేరు నిలబెట్టాడు. దీంతో తెలుగులో అతనికి మంచి గుర్తింపు లభించింది. ఇక తాజాగా ఆది ‘షణ్ముక’ అనే థ్రిల్లింగ్ కథతో రాబోతున్నాడు. అవికాగోర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకత్వం వహిస్తుండగా.. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘షణ్ముక’ ఈ నెల…
రెండేళ్లుగా ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు శుభవార్త. ‘ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో ఓ సక్సెస్ ను అందుకున్న హీరో అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల క్రితం తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా ఎట్టకేలకు స్ట్రీమింగ్కు వచ్చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం అనుకున్నంత రీతిలో సక్సెస్ సాధించలేక పోయింది.
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఇది 10వ సినిమా. దీనిని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ , ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మించాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ఈ సినిమాను రూపొందించారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటుడు ఆమిర్ ఖాన్ అభిమానులకు రేపు చాలా ప్రత్యేకమైన రోజు. ఒకవైపు.. దేశం మొత్తం రేపు హోలీ రంగులలో మునిగిపోతుండగా మరోవైపు, ఆమిర్ తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. రేపు అంటే మార్చి 14న అమీర్ పుట్టినరోజు. ఈ నటుడు తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు ముంబైలో అభిమానులు, ఫొటో గ్రాఫర్లతో కలిసి తన పుట్టినరోజును జరుపుకున్నాడు.
బాలీవుడ్ నటి ఆలియా భట్ తన కూతురు రియా చిత్రాలను ఇటీవల సోషల్ మీడియా నుంచి తొలగించింది. ఇన్స్టాగ్రామ్లో నటిని ఫాలో అవుతున్న యూజర్లు.. ఆలియా తన కూతురి ఫోటోలన్నింటినీ తొలగించినట్లు గమనించారు. నటి అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందని అనుచరులు తమదైన రీతిలో ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలియా వెళ్లిన జామ్నగర్ ట్రిప్, పారిస్ ట్రిప్ లకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు తన ఖాతాలో కనిపించడం లేదు. తాజాగా ఈ అంశంపై ఆలియా క్లారిటీ ఇచ్చింది. మీడియాతో మాట్లాడిన ఆమె తన…
సంతోషాల కేళి.. సంబరాల హోలీ.. ఏటా దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటాము. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని కూడా పిలుస్తారు. పల్లెల నుంచి పట్టణాలదాకా ఎక్కడ చూసినా రంగులే కనిపిస్తున్నాయి. చిన్న నుంచి పెద్దల దాకా అందరూ రంగులు పూసుకుంటూ..
రేపే రంగుల పండుగ హోలీ. ఈ పండుగను ఆనందంగా జరుపుకొనేందుకు చిన్నారులు, యువతీయువకులు, పెద్దలు సిద్ధమయ్యారు. అయితే రంగుల విషయంలో జాగ్రత్తలు పాటించక పోతే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి పూర్వం సహజ సిద్ధ రంగులైన.. హెన్నా, పసుపు, కుంకుమ, చందనం, బుక్క గులాలు, మో దుగ పూలతో తయారు చేసిన రంగులు, టమాట గింజలతో తయారు చేసిన పొడిని పూసుకునే వారు. వీటి వల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
హీరో నాని ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరొకపక్క నిర్మాతగా కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలా ఆయన హీరోగా హిట్లు కొడుతూనే నిర్మాతగా కూడా హిట్లు కొడుతూ డబ్బులు వెనకేసుకుంటున్నాడు. తాజాగా నాని సమర్పిస్తున్న కోర్ట్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మీద నాని ముందు నుంచి నమ్మకం కనబరుస్తున్నారు. ఒక రోజు ముందు ప్రీమియర్స్ వేయడం కామన్ అయింది కానీ ఏకంగా రెండు రోజులు ముందు మీడియాకి ప్రీమియర్స్…
బ్రహ్మ ఆనందం అనే పేరుతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో, ఆయన కొడుకు రాజా గౌతమ్ మనవడిగా నటించారు. వెన్నెల కిషోర్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో సినిమా మీద అంచనాలను పెంచింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టీమ్ వెల్లడించింది. ఆహా వేదికగా ఇది మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.