MLA Raja Singh : బక్రీద్ పండుగ ఎలా జరుపుకుంటారో మాకు అనవసరం.. కానీ..
- పండుగ ఎలా జరుపుకుంటారో మాకు అనవసరం
- కానీ పశువులను కోస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
- లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మేము బాధ్యులం కాదు
- పశువుల రవాణాలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలి
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, ఎద్దులను కోయకుండా సీఎం, డీజీపీ చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. పండుగ ఎలా జరుపుకుంటారో తమకు అనవసరమని.. కానీ పశువులను కోస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే తాము బాధ్యులం కాదని తేల్చిచెప్పారు. పశువుల రవాణాలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. పశువుల వాహనాలను పోలీసులు తూ తూ మంత్రంగా చెక్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ రవాణాను అడ్డుకుంటున్న తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
READ MORE: Weather Update: ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన..
Also Read
పోలీసులు అడ్డుకుంటున్న వాహనాలను ఎంఐఎం కార్పొరేటర్లు గుండాల ప్రవర్తించి విడిపిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఇప్పటికే చాలా ఆవులు, ఎద్దులు సిటీలోకి వచ్చాయన్నారు. సీఎం రాష్ట్రానికి రాజు లాంటి వాడు.. ముఖ్యమంత్రి గోమాత ప్రేమికుడని ఎన్నికల సమయంలో గోమాతను పూజ చేయడం చూశానని రాజాసింగ్ చెప్పారు. కాబట్టి రాష్ట్రంలో పాపం ఎవరు చేసిన అది సీఎం రేవంత్ రెడ్డికే తగులుతుందన్నారు. జూన్ 7న బక్రీద్ నాడు.. పాపంలో భాగస్వామి కావొద్దని సీఎం రేవంత్‌కు సూచించారు. ఆవులు, ఎద్దులు, దూడలు తీసుకొని వస్తున్నా వారిపై మీరు యాక్షన్ తీసుకోవాలని.. లేదంటే మేము యాక్షన్ తీసుకుంటామన్నారు.
READ MORE: Hyderabad: గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంపై సంచలన విషయాలు బయటపెట్టిన బాధితులు..!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?