క్రికెట్ మ్యాచ్ ఆడుతూ పాకిస్థాన్ సంతతికి చెందిన క్రికెటర్ మరణించాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరిగింది. మరణించిన పాకిస్థాన్ సంతతికి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ జునైద్ జాఫర్ ఖాన్ వయస్సు 40 సంవత్సరాలు పైబడి ఉంది. జునైద్ క్లబ్ స్థాయి ఆటగాడు. అతను మ్యాచ్ ఆడుతున్నప్పుడు.. ఉష్ణోగ్రత 41.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంది.
చాలా మందికి.. ఇంట్లో చేసినవి కంటే.. బయట ఆహారాల మీదనే ఇంట్రస్ట్ ఉంటుంది. అవే రుచిగా ఉంటాయి కదా..! కానీ వాటిని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? మేకింగ్ ఎందుకు ఈటింగ్ మాత్రమే మాకు కావాలి అంటారా? ఈ వార్త వింటే చూసిన తర్వాత బయట ఫుడ్‌పై మీరు విసుగుచెందుతారు. వాస్తవానికి.. పంజాబ్ రాష్ట్రం మొహాలీ జిల్లా మాటౌర్ గ్రామంలో అక్రమ మోమో, స్ప్రింగ్ రోల్ తయారీ యూనిట్‌పై మున్సిపల్ కార్పొరేషన్ వైద్య బృందం […]
ఎన్నికల పారదర్శకతపై పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ దేశంలోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలను డాటాను విశ్లేషించింది. మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేలలో 4,092 మంది అఫిడవిట్లను పరిశీలించింది. ఈ మేరకు ఓ నివేదిక తయారు చేసింది. గత ఐదు సంవత్సరాలలో వేరే పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి.. పార్టీ మారిన 63 మంది ఎమ్మెల్యేల జాబితా కూడా రూపొందించింది. ఎమ్మెల్యేల నేర నేపథ్యం, వారి ఆస్తుల వివరాల గురించి తెలుసుకుందాం..
ఏపీలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి తన కుమారులను దారుణంగా చంపేశాడు. అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఇద్దరు కుమారుల కాళ్లూ చేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచేశాడు. ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ.. ఇద్దరు బాలురు తుది శ్వాస వదిలారు. ఈ ఘటన అనంతరం ఆ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్నా, ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని అందుకే చంపేసి తానూ ఆయువు తీసుకుంటున్నట్లు ఆ తండ్రి…
సీఆర్‌జెడ్ ఉల్లంఘనలు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. భీమిలి బీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ పూర్తిగా తొలగిస్తోంది. ఇక్కడ నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇసుక తిన్నెలు మీద భారీగా గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన భవనం అక్రమ నిర్మాణాలుగా నిర్ధారణ కావడంతో కూల్చి వేయాలని హైకోర్టు ఆదేశించింది.
జగన్ కమిడియన్ అయితే.. మరి నువ్వేంటి? అని ఎమ్మెల్సీ నాగబాబును మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "నువ్వు, మీ అన్న, మీ తమ్ముడు ముగ్గురూ రాజకీయాల్లోకి వచ్చారు. మీ అన్న ఎలాగోలా కాంగ్రెస్‌లో చేరి మంత్రి అయ్యాడు. శాసనసభకు రావడానికి మీ తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి పదహారు సంవత్సరాల సమయం పట్టింది. అది కూడా చంద్రబాబు నాయుడు సంక ఎక్కితే ఎమ్మెల్యే అయ్యారు.
ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం.. రెండూ మన భారతదేశం యొక్క జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న జనసేన సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందించారు. తాజాగా పవన్ వారికి ఎక్స్ వేదికగా సమాధానం చెప్పారు.
తమ పార్టీ నుంచి వాళ్ల పార్టీకి బాలినేని అలిగి వెళ్ళారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “నా ఆస్తులు నాశనం చేసుకున్నాను అంటారు.. జగన్ నా దోపిడీ చేసారు అని చెప్పటానికి సిగ్గులేదా.. పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలు చెబుతున్నా అని మాట్లాడారు.. బాలినేని, సాయిరెడ్డి ఇద్దరు జగన్ పక్కన ఉండి రాజకీయాలు చేయలేదా.. ఇలాంటి వాళ్ళను నమ్మి పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తే ఇంక అంతే […]
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ నుంచి వెళ్తూ కార్యకర్త హఠాన్మరణం చెందారు. అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త అడపా దుర్గాప్రసాద్ పార్టీ ఆవిర్భావ సభ నుంచి తిరిగి వెళ్తూ హఠాన్మరణం చెందినట్లు పార్టీ పేర్కొంది. ఈ ఘటన ఎలా జరిగింది అనే అంశంపై క్లారిటీ లేదు. కాగా.. ఈ ఘటనపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయం తనకు తెలిసి చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.…
పిఠాపురం జనసేనకు పుష్కర కాలం తర్వాత ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారని.. పవన్ కళ్యాణ్ తొలిసారి శాసనసభకు గెలిచిన తర్వాత తొలిసభ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సభ కోసం ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూశారన్నారు.. పవన్ కళ్యాణ్ రెండు గంటల పాటు ఒక సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని..