IPL 2025: ఫైనల్‌లో ఆర్సీబీ ఓడిపోతే.. నా భర్తకు విడాకులు ఇచ్చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్సీబీ.. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్నప్పటికీ ఇప్పటివరకూ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఫ్యాన్ బేస్, ఆటపరంగా చూస్తే సీఎస్కే, ముంబై ఇండియన్స్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు..! ఐపీఎల్ 18 సీజన్‌లలో పది సార్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్లినా ఫలితం శూన్యం. ముంబై ఇండియన్స్ 11 సార్లు ఈ ఫీట్ సాధించింది. ఇక ఈసారి మాత్రం ఆర్సీబీ.. ప్రత్యర్థి జట్లకు హడల్ లెత్తిస్తూ.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్ చేరింది. దీంతో ‘ఈసాల కప్ నమదే..’ అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. టైటిల్ గెలవాలని పూజలు చేస్తున్నారు. మొక్కులు మొక్కుతున్నారు.
READ MORE: Anchor Shyamala: పులివెందులలో యాంకర్ శ్యామల పర్యటన.. అందుకే నా పయనం..!
Also Read
కానీ.. ఓ మహిళా అభిమాని మాత్రం వింత స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆర్సీబీ గెలుపును తన భర్తకు ముడిపెట్టింది. ఆర్సీబీ ఫైనల్‌లో గెలవకపోతే భర్తకు విడాకులు ఇస్తానంటూ సంచలన ప్రకటన చేసింది. రెండ్రోల కిందట ఆర్సీబీకి, లక్నో సూపర్ కింగ్స్‌కు మధ్య లక్నో స్టేడియంలో మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు చిరాయా అనే మహిళ వచ్చింది. మ్యాచ్ జరుగుతుండగా ఓ మహిళ ఫ్లకార్డు ప్రదర్శిస్తూ కనిపించింది. ఆ ఫ్లకార్డు చూసి చుట్టుపక్కల జనాలు అవాక్కయ్యారు. అందులో ‘ ఆర్సీబీ అగర్ ఫైనల్ జీతీ తో మైనే అప్నీ పతీ కో తలాక్ దేదుంగీ( ఆర్సీబీ ఫైనల్ గెలవకుంటే.. నేను నా భర్తకు విడాకులు ఇచ్చేస్తాను) అని హిందీలో రాసి ఉంది. ఆ పోస్టర్‌ను ప్రదర్శించడగానికి కారణాలేంటో తెలియదు కానీ.. ప్రస్తుతం చిరాయా మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టర్‌ను పట్టుకుని నిలబడ్డ చిరాయా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ఈ పోస్టులపై నెటిజన్లు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.
READ MORE: Ashanya: మోడీని కలిసిన పహల్గామ్ బాధితురాలు.. ప్రధాని ఏం హామీ ఇచ్చారంటే..!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!