టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్(IPL)లో చరిత్ర సృష్టించాడు. ఇవాళ 2025 మ్యాచ్ నంబర్-37లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముల్లన్పూర్ (న్యూ చండీగఢ్)లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘతన సాధించాడు. విరాట్ కోహ్లీ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో కోహ్లీకిది 59వ అర్ధశతకం. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా అర్ధ శతకాలు…
విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాలల్లో ఐదుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకి పాల్పడుతూ పట్టుబడ్డారు. ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మాల్ ప్రాక్టీసులో వైద్య కళాశాలలో కీలక విభాగం నిర్లక్ష్యం ఉన్నట్టు నిర్ధారణ విచారణలో తేలింది. 12 మందిపై చర్యలు తీసుకోవాలని నివేదిక తేల్చింది. కళాశాల సూపరెండెంట్ ఎగ్జామినర్, డిప్యూటీ సూపరింటెండెంట్, 8 మంది ఇన్విజలేటర్లు, ఇద్దరు క్లర్క్ లపై చర్యలకు సిఫార్సు చేసింది. ఉద్యోగులపై బదిలీ లేదా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ…
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. తాజాగా ఈ అంశంపై అజారుద్దీన్ స్పందించారు. ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
నేడు బెంగళూరు, ఆర్సీబీ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ ఈసారి తన సొంతమైదానం ముల్లాన్‌పుర్‌లో ఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. పరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బెంగళూరు లక్ష్యం 158 పరుగులు.
ప్రముఖ అంతర్జాయతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్‌పై నాడా సస్పెన్షన్ వేటు వేసింది. రమేష్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వెల్లడించింది. నాగపురి రమేష్ దగ్గర కోచింగ్ తీసుకున్న ఇద్దరు క్రీడాకారులు డోప్ టెస్ట్ కు నిరాకరించారనే ఆరోపణలు ఉన్నాయి. డోప్ టెస్ట్ కు సాంపిల్స్ ఇవ్వకుండా దాటవేసినట్లు తెలిసింది. ఈ అంశంలో వారికీ కోచ్ గా ఉన్న నాగపురి రమేష్ పై వేటు పడింది. కాగా.. నాగపురి రమేష్ గతంలో ద్రోణాచారి అవార్డు పొందారు.
ఆన్లైన్ గేమ్స్ మరో యువకుడి ప్రాణాలు తీసింది. బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోవడంతో మనస్తాపం చెందిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పైరేట్ గ్రామానికి చెందిన జైచంద్రగా గుర్తించారు. ఆన్లైన్ గేమ్స్, యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దంటూ టీషర్ట్‌పై రాసుకున్నాడు యువకుడు. అయితే.. బెట్టింగుల కారణంగా తీవ్ర అప్పుల పాలై అవి తీర్చలేక ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
అమరావతిలో చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలు పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాల్లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలకు సంబంధించి, రెండు పుస్తకాలను జయప్రద ఫౌండేషన్ ప్రచురించింది. ఈ కార్యక్రమంలో పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్ మాట్లాడారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-37లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముల్లన్పూర్ (న్యూ చండీగఢ్)లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నేడు రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రాజస్థాన్ జట్టు నుంచి సంజు శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అతని స్థానంలో రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కాగా.. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ 36వ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్ జట్టు నుంచి సంజు శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.