అమెరికా వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 74 కి పెరిగిందని, 171 మంది గాయపడ్డారని యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. దేశంలోని చమురు ఓడరేవును లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదిక ప్రకారం.. హౌతీ తిరుగుబాటుదారులు ఈ సమాచారాన్ని బహిరంగ ప్రకటనలో ఇచ్చారు. అయితే.. ఈ వాదనను అమెరికా సైన్యం ఇంకా ధృవీకరించలేదు. గత నెల రోజుల వైమానిక దాడుల్లో ఇప్పటివరకు జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదేనని హౌతీ తిరుగుబాటుదారులు తెలిపారు.
ఐపీఎల్ 2025 మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టోర్నమెంట్ మధ్యలోనే నిష్క్రమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఎస్ఆర్హెచ్ లేదా కమిన్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పాట్ భార్య బెక్కీ కమ్మిన్స్ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. దీంతో ఊహాగానాలుగా మొదలయ్యాయి.
వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండకు బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి తీవ్రత వడదెబ్బకు దారి తీసే ప్రమాదముంది. చాలామంది చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, శారీరక శ్రమ చేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
రోహిత్ వేముల పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. గతంలో పలు కారణాలతో హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్ వేముల. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ పేరును ప్రస్తావించారు. విద్యావ్యవస్థలో నేటికి బలహీన వర్గాలు కుల వివక్షను ఎదుర్కొంటున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే ‘రోహిత్ వేముల’ చట్టాన్ని రూపొందించాలని.. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సూచించారు. ఈ రోజు కర్ణాటక సీఎంకు రాహుల్…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడు గ్రామస్థులందరికీ చెప్పులు పంపిణీ చేశారు. ఇటీవల "అడవితల్లి బాట" అనే కార్యక్రమంలో భాగంగా పవన్ ఆదివాసీ గ్రామం పెదపాడులో పర్యటించిన విషయం విదితమే. ఆ సమయంలో పాంగి మిథు అనే వృద్ధురాలు పవన్‌కళ్యాణ్ కోసం నడిచి వచ్చి స్వాగతం పలికారు.
ఏటీఎం ప్రారంభానికి ఎవరు వస్తారు? ఆ ఏటీఎంకి సంబంధించిన బ్యాంకు మేనేజర్, లేదా ఇతర కింది స్థాయి అధికారులు హాజరవుతారు. కానీ.. ఏటీఎం ప్రారంభానికి ఏకంగా ప్రధాని హాజరు కావడం ఎప్పుడైనా చూశారా? లేదా విన్నారా? కానీ.. ఇక్కడి అది జరిగింది. అవునండి.. నిజంగానే ఏటీఎం ప్రారంభానికి ప్రధాని హాజరయ్యారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ.. ఏం చేస్తాం ఆ దేశంలో ఇదే తొలి ఏటీఎం మరి.
కన్న కొడుకే ఆమె పాలిట యముడయ్యాడు. కని పెంచిన కొడుకే కేవలం రూ. 200 కోసం కన్న తల్లినే కడతేర్చాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ విషయం విన్న వారందరూ ఆ కొడుకుపై విరుచుకుపడుతున్నారు. తన వృద్ధ తల్లి ప్రాణాలను తీసిన కొడుకును చూసి అసహ్యించుకుంటున్నారు. కుక్క కొనడానికి రూ.200 ఇవ్వాలని కొడుకు కోరగా.. ఆ తల్లి నిరాకరించిందని అందుకో తన 70 ఏళ్ల తల్లిని కొట్టి చంపాడని పోలీసులు చెబుతున్నారు.
భగవద్గీత, భరత ముని నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో వీటిని చేర్చారు. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమైన క్షణం అని ఆయన అభివర్ణించారు.
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ఏటా విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే 9 మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విక్టరీ డే వేడుకలకు పలు దేశాధినేతలకు ఆహ్వానాలు పంపింది రష్యా. అందులో భాగంగా భారతదేశానికి సైతం ఆహ్వానం పంపినట్లు రష్యా తెలిపింది. అయితే భారత్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ హాజరవుతున్నట్లు…
ఐపీఎల్ 2025లో 33వ మ్యాచ్ గురువారం ముంబై ఇండియన్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.