Bengaluru: టెక్ సిటీలో అమానుషం.. తండ్రిని సంచిలో పెట్టి కొరియర్‌కు యత్నం.. ఆ తర్వాత ఏమైందంటే..!
- టెక్ సిటీలో అమానుషం
- తండ్రిని సంచిలో పెట్టి కొరియర్‌కు యత్నం
- రంగంలోకి దిగిన పోలీసులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. కొందరి చేష్టలు అసహ్యం పుట్టిస్తున్నాయి. ఫేమస్ అవ్వడం కోసం ఏం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో లాభం కంటే అనర్థమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందుకు టెక్ సిటీ బెంగళూరులో జరిగిన సంఘటనే ఉదాహరణ. రీల్స్ కోసం కన్న తండ్రినే ప్రాణాలను పణంగా పెట్టింది ఓ కూతురు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Also Read
- UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
- IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
- Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
- PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
బెంగళూరులోని ఒక కొరియర్ కార్యాలయానికి ఒక పెద్ద సంచి మూటను కొందరు వ్యక్తులు తీసుకొచ్చారు. పార్శిల్ చేయాలంటూ సిబ్బందికి సూచించారు. అయితే సంచి కదలడంతో అనుమానం వచ్చి సిబ్బంది తెరిచి చూడక హఠాత్తుగా ఒక పెద్దాయన అందులోంచి బయటకు వచ్చాడు. దీంతో సిబ్బంది షాక్ అయ్యారు. నిలదీయడంతో డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతే అక్కడ నుంచి పరారయ్యారు. అయితే మూటలో ఉన్న వ్యక్తి పెద్దాయన కావడంతో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. బయటకు రాగానే మంచి నీళ్లు తాగి ఊపిరి పీల్చుకున్నాడు. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసి పోయేవి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇక రంగంలోకి దిగిన పోలీసులు… కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే రీల్స్ కోసం సరదాగా ఈ నాటకం ఆడామని.. పండగ సమయాల్లో బస్సు టికెట్ ధరలు పెరిగిపోవడం, టికెట్లు దొరక్కపోవడం వంటి పరిస్థితులను తెలియజేసేందుకే ఇలా నటించినట్లుగా తెలిపారు. దీంతో వారిని హెచ్చరించి పోలీసులు వదిలిపెట్టేశారు. అయితే ఈ వ్యవహారం సీరియస్‌గా మారడంతో కుటుంబ సభ్యులు క్షమాపణలు చెప్పారు.
Daughter & family stuff father in gunny bag, take him to courier office to "send parcel" out of Bengaluru all for a reel showing it's easier to courier a man than book bus/train tickets this festive season. Now in police station.
Weird world. 😭
pic.twitter.com/gGEpKeeYjM— Ghar Ke Kalesh (@gharkekalesh) March 17, 2026
తాజావార్తలు
-
Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
-
UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
-
IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
-
Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!