Kurnool : వివాహేతర బంధం.. వేట కొడవళ్లతో దాడి చేసి దారుణ హత్య..
- సూదిరెడ్డిపల్లిలో శేషన్నఅనే వ్యక్తి దారుణ హత్య
- కర్రలు, వేట కొడవలితో దాడి చేసిన నలుగురు వ్యక్తులు
- పరశురాముడు, మరో ముగ్గురు కలిసి దారుణం
- పరశురాముడు, శేషన్న కుటుంబాల మధ్య గొడవలు
- భార్యతో శేషన్నకు వివాహేతర బంధం ఉందని అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాహేతర సంబంధాలు, అనుమానాలతో హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో ఓ వృద్ధున్ని దారుణంగా కాలు నరికి బైక్‌పై తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. అంతే కాదు.. నరికిన కాలు చేతిలో పట్టుకొని బైక్‌పై వెళ్తున్న భయానక దృశ్యాలు సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు.
READ MORE: Minister Nimmala Ramanaidu: వైసీపీ విధ్వంస పాలనలో 450 ఎత్తిపోతల పథకాలు మూత.. మంత్రి ఆరోపణ..
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లిలో శేషన్నఅనే వ్యక్తి దారుణంగా నరికి హత్య చేశారు. శేషన్న అనే వ్యక్తి ఇంట్లో
ఉండగా మాట్లాడాలని వెళ్లిన నలుగురు వ్యక్తులు కర్రలు, వేట కొడవలితో దాడి చేశారు. వేటకొడవలితో రెండు కాళ్లు నరికేశారు. ఒక కాలు పూర్తిగా నరికి బైక్‌లో తమ వెంట తీసుకువెళ్లారు నిందితులు. పరశురాముడు, మరో ముగ్గురు కలసి ఈ దారుణానికి ఒడిగట్టారు. ప్రస్తుతం నిందితులు పోలీసులకు లొంగిపోయారు. తమతోపాటు తెచ్చిన కాలును చూసి పోలీసులు విస్తుపోయారు..
READ MORE: Crime: వితంతు, భర్తలకు దూరంగా ఉండే మహిళలే టార్గెట్.. కానిస్టేబుల్‌గా నటిస్తూ లైంగిక దోపిడి..
సూదిరెడ్డిపల్లిలో నివాసముంటూ శేషన్న డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన పరశురాముడు, శేషన్న కుటుంబాల మధ్య గత కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. పరుశురాముని భార్యతో శేషన్నకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నారు. ఎలాగైనా శేషన్నను హత్య చేయాలని నిర్ణయించుకున్న పరశురాముడు ప్లాన్ ప్రకారం రాత్రి శేషన్న ఇంట్లో ఉండగా మరో ముగ్గురిని కలుపుకొని వారి ఇంటికి వెళ్లారు. శేషన్న మంచంపై పడుకొని ఉండగా వేటకొడవళ్ళు, కర్రలతో దాడి చేశారు. రెండు కాళ్ళు నరికివేశారు.
READ MORE: Most-Wanted Terrorists: ఏపీలోని ఆ రెండు జిల్లాల్లో ఉగ్రమూకల కలకలం..
ముందుగా గ్రామంలో తిరిగి ఆ తరువాత ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఇంటికి వెళ్లారు. రాత్రి వేళ రక్తపు దుస్తులతో చేతిలో నరికిన కాలు పట్టుకొని నిందితులు రావడంతో ఎమ్మెల్యే దస్తగిరి కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కొద్ది సేపటికి తేరుకొని ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని కేకలు వేసి వారిని పంపించేశారు. నిందితులు నరికిన కాలు అలాగే చేతిలో పట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆ రాత్రి వేళ నరికిన కాలుతో నిందితులు స్టేషన్‌కు రావడంతో విస్తుపోయారు పోలీసులు. ఏమి జరిగిందో వారి నుంచి వివరాలు తెలుసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శేషన్న పిల్లలకు పెళ్లిళ్లయ్యాయి. మనవళ్ళు, మనవరాలు ఉన్నారు. తమ తండ్రిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు శేషన్న కుమార్తెలు..
తాజావార్తలు
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!