ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ బాగా పాపులర్ అయ్యింది. ఇందులో రీల్స్ చేస్తూ.. లైక్స్, ఫాలోవర్స్ కోసం ఆరాటపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీని మోజులో పడి నలిగి పోతున్నారు. గంటలతరబడి రోజుల తరబడి రీల్స్ చూస్తూ అలాగే ఒకదానితరువాత మరొకటి స్క్రోల్ చేస్తూ కూర్చుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య చాలామంది ఇన్స్ట్రాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో రీల్స్ ని స్ర్కోల్ చేస్తూ కూర్చోవడం గమనిస్తుంటాం. హాస్పిటల్ లో పేషంట్ పక్కనే కూర్చుని చేతిలో సెల్ఫోన్ పట్టుకుని రీల్స్ చూస్తూ గడిపేవారు కోకొల్లలు. ఇలా అందరికీ ఈ పిచ్చి ముదిరిపోయింది. అయితే.. ఇలా గంటల తరబడి రీల్స్ చూడటం వల్ల జరినే అనర్థాల గురించి పరిశోధకులు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
READ MORE: Fake Casting Alert: మా పేరు చెప్పుకుని హీరోయిన్స్ కు ఫ్రాడ్ ఆఫర్‌లు .. యూవీ సంస్థ కీలక ప్రకటన
అదే పనిగా ఇన్స్ట్రాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో రీల్స్, షాట్స్ వీడియోలను చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందని నిపుణులు వెల్లడించారు. దీంతో ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ ఉందని, మరి ముఖ్యంగా చిన్నారులు, యువతలో దృష్టిలోపాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. అధిక స్క్రీన్ టైంతో కంటిపై పడే డిజిటల్ ఒత్తిడి ఓ నిశబ్దపు మహమ్మారిగా కంటి చూపును దెబ్బతీస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా రీల్స్ చూస్తూ గంటల తరబడి ఎలక్ట్రానిక్ పరికరాలకు అతుక్కుపోవడంతో పిల్లల్లో కళ్లు పొడిబారిపోవటం, హాస్వ దృష్టి పెరగటం, కళ్లు ఒత్తిడికి గురికావడంతో పాటు చిన్న వయస్సులోనే మెల్లకన్ను రావటం వంటి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు.
READ MORE: Report: నెలలు నిండకముందే జననం, తక్కువ బరువు.. ప్రమాదంలో పసిపిల్లలు..
నలుగురూ కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకోవడం మానేశారు. ఎందరిలో ఉన్నా.. ఫోన్ మీదే, రీల్స్ మీదే దృష్టి పెట్టడంతో చాలా విషయాలు తెలుసుకోలేక పోతున్నారు. ముఖ్యంగా ఇంట్లో తల్లులు తాము ఇంటి పని చేస్తున్నప్పుడు పిల్లలు విసిగిస్తున్నారని వారికి ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. ఇలా పిల్లలు గంటల తరబడి రీల్స్, వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారు. ఇలాంటి పిల్లలకు మాటలు త్వరగా రావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా రీల్స్ చూడటం తగ్గించుకుని పిల్లలకు పుస్తకాలు చదవటం అలవాటు చేయించాలి. మరీ చిన్న పిల్లలకు ఏదైనా సృజనాత్మకతను పెంచే ఆటలు ఆడించాలి. ముఖ్యంగా పెద్దలు పిల్లల ముందు రీల్స్ చూడటం మానేయాలి. ఎందుకంటే.. పెద్దలను పిల్లలు అనుసరిస్తునే ఉంటారు.