పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం.. భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. దీంతో భారత్ దాయాది దేశంపై అనేక చర్యలు తీసుకుంది. పాకిస్థాన్ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను నిషేధించింది. కానీ.. బుధవారం వారి ఖాతాలను అన్‌బ్లాక్ చేసినట్లు వార్తలు చెక్కర్లు కొట్టాయి. అనంతరం ఒక రోజు తర్వాత వాటిని మళ్ళీ బ్లాక్ చేశారు. గురువారం ఉదయం నుంచి పాకిస్థాన్‌కి చెందిన షాహిద్ అఫ్రిది, మావ్రా హోకేన్, యుమ్నా జైదీ, హనియా అమీర్, ఫవాద్ ఖాన్ వంటి ప్రముఖ తారల ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి.
READ MORE: Delhi Vehicle Policy : పాత వాహనాల నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం యూటర్న్..
వాస్తవానికి.. బుధవారం పాకిస్థాన్ స్టార్ల ఖాతాలు భారత్‌లో కొన్ని గంటల పాటు మళ్లీ కనిపించాయి. భారత ప్రభుత్వం పాకిస్థానీ సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం ఎత్తివేసిందని అభిప్రాయపడ్డారు. కానీ గురువారం ఉదయం నాటికి.. భారతీయ వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌లో పాక్ తారల ఖాతాలను ఓపెన్ చేయగా.. ‘ఈ ఖాతా భారతదేశంలో అందుబాటులో లేదు. ఎందుకంటే ఈ కంటెంట్‌ను నిషేధించాలనే చట్టపరమైన అభ్యర్థనను మేము పాటించాం’ అని రాసి ఉన్న సందేశం కనిపించింది. ఈ అంశంపై జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. “సాంకేతిక లోపం కారణంగా ఖాతాలు ఓపెన్ అయ్యాయి. మీకు ఎక్స్, యూట్యూబ్, మెటాలో కొన్ని పాకిస్థాన్ సంబంధిత ఖాతాలు కనిపిస్తే అవి కొన్ని గంటల్లో మళ్లీ బ్లాక్ చేయబడతాయి. కొన్ని సాంకేతిక లోపం కారణంగా బుధవారం ఆయా ఖాతాలు అన్‌బ్లాక్ చేయబడ్డాయి. గురువారం నాటికి గుర్తించి సరి చేశాం” అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
READ MORE: Pakistan: ‘‘ ప్రతిస్పందించడానికి మాకు 30 సెకన్ల టైమ్ మాత్రమే ఉంది’’.. బ్రహ్మోస్ దాడిపై పాకిస్తాన్..