ఈ రోజు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలకానున్నాయి. ఈ ఫలితాలను ఇంటర్‌బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. వారి భవితవ్యం నేడు తేలనుంది.
యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన చిడేమ్ సాయి అనే యువకుడు ఈ నెల 15వ తేదీన రాత్రి 7 గంటలకు మిస్సింగ్ అయినట్లు 16న స్టేషన్లో కేసు నమోదైంది. అదృశ్యమైన ప్రాంతం హనుమకొండ పోలీస్ స్టేషన్లో సాయి కుటుంబ సభ్యులు 18వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సంచలన విషయం వెల్లడైంది. గతంలో వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ వివాహేతర బంధాన్ని సాయి బయటపెట్టినట్లు తేలింది. నేరం…
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం. పల్లె నుంచి పట్నం వరకు, దేశధినేతల నుంచి విదేశీయుల వరకు అందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బర్త్‌డే బర్త్ డే విషెస్‌పై సీఎం స్పందించారు. "నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు." అని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో రాసుకొచ్చారు. చాలా విషయాలను ఆయన పంచుకున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)లో ఈరోజు ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నైని ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన ధోనీ నాయకత్వంలోని సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
కైకలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో కొల్లేరు నాయకులు, ప్రజలతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న తరుణంలో కొల్లేరు నేతలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. గడిచిన 25 ఏళ్ళ నుంచి పర్యావరణ వేత్తలు పర్యావరణం తప్ప మనుషుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. కొల్లేరులో పక్షులు బతకాలి.. మనుషులు కూడా ముఖ్యమే అని తెలిపారు. మొదటి సారి ప్రజల మనుగడ గురించి హస్తినకు తెలియజేసిన ఘనత కుటమి ప్రభుత్వానిదన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు 36 మ్యాచ్‌లు విజయవంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బ్యాటర్లు, బౌలర్లు, సిక్సర్లు, ఫోర్లలో టాప్ 3లో ఉన్నదెవరో చూసేద్దం రండి...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 డబుల్ హెడర్ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ వేసింది. బరిలోకి దిగిన పంజాబ్ జట్టును 6 వికెట్లకు 157 పరుగుల స్కోరు చేసింది. ఆర్సీబీ7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. పడిక్కల్(61) దించికొట్టాడు. కింగ్ కోహ్లీ(71) వీర బాదుడు బాదాడు. వీరిద్దరూ మంచి భాగస్వామ్యం అందించారు. 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ మరో చరిత్ర…
టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్(IPL)లో చరిత్ర సృష్టించాడు. ఇవాళ 2025 మ్యాచ్ నంబర్-37లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముల్లన్పూర్ (న్యూ చండీగఢ్)లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘతన సాధించాడు. విరాట్ కోహ్లీ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో కోహ్లీకిది 59వ అర్ధశతకం. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా అర్ధ శతకాలు…
విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాలల్లో ఐదుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకి పాల్పడుతూ పట్టుబడ్డారు. ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మాల్ ప్రాక్టీసులో వైద్య కళాశాలలో కీలక విభాగం నిర్లక్ష్యం ఉన్నట్టు నిర్ధారణ విచారణలో తేలింది. 12 మందిపై చర్యలు తీసుకోవాలని నివేదిక తేల్చింది. కళాశాల సూపరెండెంట్ ఎగ్జామినర్, డిప్యూటీ సూపరింటెండెంట్, 8 మంది ఇన్విజలేటర్లు, ఇద్దరు క్లర్క్ లపై చర్యలకు సిఫార్సు చేసింది. ఉద్యోగులపై బదిలీ లేదా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ…
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. తాజాగా ఈ అంశంపై అజారుద్దీన్ స్పందించారు. ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.