హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశించింది. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై అంబుడ్స్‌మన్ విచారణ చేపట్టారు..హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో తన పేరు పెట్టుకోవాలని అజార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో విచారణ చేపట్టి వెంటనే ఆ పేరును తొలగించారు.
మహేంద్ర సింగ్ ధోని.. చెన్నై సూపర్ కింగ్స్ .. ఈ రెండూ పర్యాయ పదాలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి చెన్నై ఐకాన్‌గా ఉన్న ధోని.. ‘తలా’గా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. సీఎస్కేను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనికి ఉన్న క్రేజ్ గురించి మాటల్లో వర్ణించడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. అయితే.. తాజాగా అశ్విన్ సైతం చెన్నై టీంకి కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ తాజాగా ధోని,…
సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరోసారి ఓటమి పాలైంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సునాయాస విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే.. ఈ సీజన్లో బెంగళూరు ఏడు మ్యాచులు ఆడింది. ఇందులో నాలుగు విజయాలు సాధించింది. విజయం సాధించిన ఈ నాలుగు మ్యాచ్‌లో బయటి స్టేడియాల్లోనే కావడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఢిల్లీ ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదు గెలిచింది. గుజరాత్ టైటాన్స్ కూడా 6 మ్యాచ్‌లు ఆడి నాలుగు గెలిచింది.
కొంత కాలంగా హృద్రోగాలతో భారత్‌లో చాలా మంది మరణించారు. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన వీడియోలు ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయ్యాయి. సాధారణంగా కనిపిస్తున్న ప్రజలకు ఒక్కసారిగా గుండెపోటు రావడం, వెంటనే కుప్పకూలడం, ఆ తర్వాత మరణించడం.. ఇలా అన్నీ నిమిషాల్లోనే జరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. కేజ్రీవాల్ కుమార్తె హర్షిత వివాహం ఘనంగా నిర్వహించారు. కూతురు ఇష్టపడిన ప్రియుడు సంభవ్ జైన్‌తో శుక్రవారం రాత్రి వివాహం అంగరంగా వైభవంగా జరిగింది. ఈ వేడుక ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో నిర్వహించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా, చాలా మంది ప్రముఖులు, ఆప్ నేతలు హాజయ్యారు.
ఐపీఎల్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో కొనసాగనుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా పూర్తి ఆట సాధ్యం కాదు. కాబట్టి 14 ఓవర్ల చొప్పున ఇరు జట్లు పోటీ పడనున్నాయి.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన మొట్ట మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డుకెక్క బోతున్నాడు. స్పేస్ఎక్స్(SpaceX) సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు పైలట్‌గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతి కూడా ఇటీవల లభించింది.
ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్-34లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడనుంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ టాస్ 7 గంటలకు జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ లేట్ అవుతోంది. భారీ వర్షం కురవడంతో స్టేడియాన్ని కవర్లతో కప్పారు.
అమెరికా వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 74 కి పెరిగిందని, 171 మంది గాయపడ్డారని యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. దేశంలోని చమురు ఓడరేవును లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదిక ప్రకారం.. హౌతీ తిరుగుబాటుదారులు ఈ సమాచారాన్ని బహిరంగ ప్రకటనలో ఇచ్చారు. అయితే.. ఈ వాదనను అమెరికా సైన్యం ఇంకా ధృవీకరించలేదు. గత నెల రోజుల వైమానిక దాడుల్లో ఇప్పటివరకు జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదేనని హౌతీ తిరుగుబాటుదారులు తెలిపారు.