ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. పలు ప్రాంతాల నుంచి కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిలో 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అన్నారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. జమ్మూకశ్మీర్ లో టెర్రరిస్టుల మారణకాండ పునరావృతం కాకుండా…
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్, కౌంటింగ్ సాగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ ఆఫీసీయో సభ్యులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కు సర్వం సిద్ధమైంది. రేపు జీహెచ్ఎంసీలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. రేపు జరిగే ఎన్నికకు ఏప్రిల్ 25న కౌంటింగ్ చేసి ఫలితాల ప్రకటిస్తారు.
బ్యాంకాక్ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి మయన్మార్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న తెలంగాణకు చెందిన యువతకు విముక్తి లభించింది. వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా, మరొకరు ఏపీకి చెందిన వ్యక్తి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని వీరిని స్వదేశానికి రప్పించారు.
నేడు తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం దాదాపు 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్టియర్‌లో 66.89 శాతం, ద్వితీయ సంవత్సరంలో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా.. ఈ ఏడాది కూడా బాలికలదే పై చేయి.
నేడు తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం ఇంటర్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మార్చి 5వ తేదీన మొదలైన ఇంటర్మీడియట్ పరీక్షలు 25న ముగిసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం దాదాపు 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్‌ని కోసం https://ntvtelugu.com/telangana-first-year-intermediate-results-2025 లింక్ పైన క్లిక్…
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి నియోజకవర్గ ఓటర్ ఫోన్ చేశాడు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేసవిలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని.. తీర్చాలని ఎమ్మెల్యేని ఓటర్ కోరాడు. త్వరలోనే తాగు నీటి కోసం నియోజకవర్గానికి రూ. 2 కోట్లు వస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. ఎప్పుడు వస్తాయని అడిగితే గ్యారెంటీ లేదని సమాధానమిచ్చారు ఎమ్మెల్యే సంజీవ రెడ్డి.
హైదరాబాద్ మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో అల్లుడు భార్య, అత్తపై కత్తితో దాడి చేశాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ నగర్ లో ఘటన జరిగింది. మహేష్ అనే వ్యక్తి శ్రీదేవిని అనే యువతిని ప్రేమ వివాహం చేసుకొని క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్, శ్రీదేవి దంపతుల మధ్య తరచూ గొడవలు చెలరేగాయి. మహేష్ నిన్న రాత్రి భార్య శ్రీదేవితోపాటు అత్తపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని నిర్మాత, రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్.డి.సి) దిల్ రాజు తెలిపారు. హెచ్ ఐసీసీ వేదికగా అవార్డులు ప్రదానం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో దిల్‌రాజు ఈ ప్రకటన చేశారు.
హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్‌లో గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు, సీనియర్ నటి జయసుధ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఏర్పాటు చేసుకున్న అవార్డులని.. దశాబ్ద కాలంగా పరిశ్రమ ఎలాంటి ప్రోత్సాహకాలకు, అవార్డులకు నోచుకోలేదన్నారు.