తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మళ్ళీ పుంజుకుంటున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల.. జూన్ నెలలో వర్షపాతం లోటు ఉన్నప్పటికీ, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం జూలైలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలోని మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చాలా మంది ప్రజలు అవస్థలు పడ్డాయి. కాగా.. చాలా మంది వర్షంలో తడుస్తుంటారు. ఇలా అలాగే ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని యాథావిధిగా పనులు చేసుకుంటుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. వర్షంలో తడిసి ఇంటికి వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: The Fantastic Four: First Steps : జులై 25న ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ మూవీ రిలీజ్..
వర్షంలో తడిసి ఇంటికి చేరుకోగానే వెంటనే మీ బట్టలు మార్చుకోండి. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. చలి అనిపించదు. దీనితో పాటు, వర్షాకాలంలో అనేక రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. వెంటనే బట్టలు మార్చడం వల్ల దానిపై ఉన్న ఫంగస్ ఇన్ఫెక్షన్ కారకాల నుంచి తప్పించుకోవచ్చు. శరీరం అంతటా ఏదైనా యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాయండి. ఇలా చేయడం ద్వారా, మీ శరీరంపై ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. మీరు ఏ రకమైన చర్మ అలెర్జీ బారిన పడకుండా ఉంటారు. రింగ్‌వార్మ్, దురద, దద్దుర్లు వంటి సమస్యల కూడా రాదు. అనంతరం మీ తలను టవల్ తో బాగా తుడుచుకోండి. వర్షపు నీరు మీ తలపై ఎక్కువసేపు ఉంటే.. జలుబు, దగ్గు మరియు ఫ్లూ బారిన పడతారు. వేడి టీ లేదా కషాయాలను తాగాలి. ఇది మీ శరీర శక్తిని పెంచడమే కాకుండా.. శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కషాయాలను తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
READ MORE: CM Chandrababu: అలా అయితే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా.. చంద్రబాబు స్వీట్ వార్నింగ్..