Bengaluru: ఎక్ట్రా కప్పు ఇవ్వనందుకు కాఫీ షాప్ సిబ్బందిని చితకబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్ట్రా కాఫీ కప్పు ఇవ్వనందుకు కస్టమర్లు ఉద్యోగిని చితకబాదిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. బెంగళూరులోని శేషాద్రిపురంలో నమ్మ ఫిల్టర్ కాఫీ షాప్ సిబ్బంది అదనపు కప్పు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన నలుగురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: HYDRA: నాలాలు పొంగొద్దు.. వరద ముంచెత్తొద్దు
Also Read
బాధితుడి కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో నలుగురు వ్యక్తులు నమ్మ ఫిల్టర్ కాఫీ షాప్‌కు వచ్చారు. ఒక కప్పు కాఫీ కొన్నారు. అదనంగా మరో ఖాళీ కప్పు కావాలని అడిగారు. ఉద్యోగి మర్యాదగా నిరాకరించి, మరో కప్పు కాఫీ కొనమని కోరాడు. దీంతో ఆ కస్టమర్లు ఉద్యోగిపై దుర్భాషలాడారు. అందులో ఓ కస్టమర్ ఉద్యోగిని తల, ముఖంపై కొట్టి, కడుపులో తన్నాడు. మిగతా వ్యక్తులు కూడా బాధితుడిపై ఘోరంగా దాడి చేశారు. కాఫీ షాపులో ఉన్న వ్యక్తులు జోక్యం చేసుకుని దాడి చేసిన వ్యక్తిని శాంతింపజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజీని చూసిన నెటిజన్లు నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
READ MORE: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Bengaluru takes its filter coffee very seriously!
Scuffle breaks out at Namma Filter Coffee in Sheshadripuram after a customer, denied an extra empty cup, thrashed the cashier
For the record extra cup is chargeable! Also this customer can't handle filter coffee. Someone please… pic.twitter.com/aaBLsVSSQG
— Nabila Jamal (@nabilajamal_) July 3, 2025
తాజావార్తలు
-
iPhone Prices Hiked: iPhone 18 Pro సిరీస్ లాంచ్ ఎఫెక్ట్.. iPhone 17, iPhone Air, iPhone 17e ధరలు భారీగా పెంపు!
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!