AP Free Bus: ఉచిత బస్సు ప్రయాణంపై రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Free Bus Scheme: ఉచిత బస్సు ప్రయాణంపై రోడ్డు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. త్వరలో ఉచిత బస్సు పథకానికి మంచి పేర్లు పెడతామన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతోంది.. ఆయా రాష్ట్రాల్లో అమలువుతున్న విధంగానే ఏపీలోనూ పథకాన్ని అమలు చేస్తామన్నారు. సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అతి ముఖ్యమైన పథకమన్నారు. అన్ని పథకాల కంటే ఎక్కవ లబ్ధిదారులు ఉండే పథకం ఇదే అన్నారు.. ఇందుకు తాజాగా కొత్త బస్సులు కొనుగోలు చేశామని తెలిపారు. చాలా వాటికి మరమ్మతులు చేపట్టామని వెల్లడించారు. ఏసీ ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను మంత్రి అయ్యాక 1200 బస్సులు కొన్నట్లు చెప్పారు.
READ MORE: Mallikarjun Kharge: ట్రంప్ వాదనలను మోడీ ఎందుకు ఖండించడం లేదు..? ఖర్గే ప్రశ్న..
Also Read
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
ఇక.. వచ్చే 15 నుంచి ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు కానుంది. పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఫ్రీ బస్సు పథకంతో ప్రజలకు ఎలా లబ్ధి కలుగుతుందో తెలిపేలా జీరో ఫేర్ టిక్కెట్ విధానాన్ని తీసుకురావాలని సూచించారు. మహిళా ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు?.. టిక్కెట్ ధర ఎంత?.. ప్రభుత్వం ఎంత మేర రాయితీ ఇస్తోంది?.. అనే సమాచారం స్పష్టంగా ఉండాలన్నారు. అవసరమైన సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.
READ MORE: Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. 7 గేట్లు ఎత్తివేత
తాజావార్తలు
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!