మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి ఏడాది అయింది. ఆమె పార్టీ అవామీ లీగ్, స్టూడెంట్స్ లీగ్‌లను బంగ్లాలో నిషేధించారు. అయినప్పటికీ.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ మనస్సులో షేక్ హసీనా భయం తొలగిపోయినట్లు కనిపించడం లేదు. మొహమ్మద్ యూనస్ మరోసారి షేక్ హసీనా పార్టీపై ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు అవామీ లీగ్ దేశంలో గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు.
READ MORE: Naga Chaithanya : ఇద్దరు పిల్లలు కావాలి.. ఇష్టాలను బయటపెట్టిన నాగచైతన్య
తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్ జాతీయ ఎన్నికలకు సంబంధించి 14 రాజకీయ పార్టీలు, కూటముల నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ.. అవామీ లీగ్ పార్టీ దేశంలో గందరగోళం సృష్టించి.. ఎన్నికలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని.. ఈ ప్రయత్నాన్ని ఆపడానికి అన్ని శక్తులు ఐక్యంగా పని చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. అన్ని శక్తులు కలిసి ఎన్నికలు సజావుగా నిర్వహించకపోతే.. గొప్ప అవకాశం కోల్పోతారన్నారు. ఓటమి పాలైన పార్టీలు అవకాశం దొరికినప్పుడల్లా అరాచకాన్ని వ్యాపింపజేస్తున్నాయని మండిపడ్డారు. దేశ పురోగతిని అడ్డుకుంటున్నారని అన్నారు. ఎన్నికలకు సన్నాహాలు చేస్తూ మనం ముందుకు సాగుతున్నప్పుడల్లా.. వివిధ కుట్రలు తెరపైకి వస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య పురోగతిని ఏ కుట్ర ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రధాన సలహాదారుడు ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీల సహకారం కోరారు.