ఒక వయసు వచ్చాక ప్రజలు తోడు కోరుకోవడం సహజం. అయితే ఒంటరి భావన నుంచి బయటపడడానికి ఏదో ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్ ప్రారంభించకూడదు. ఎందుకంటే వారు ఉత్తములు కాకపోతే జీవితం మరింత కష్టంగా మారుతుంది. అందుకే ఇప్పుడు మనం ఫేక్ లవ్ కు ఉండే లక్షణాలు.. నకిలీ ప్రేమలో ఉండే సంకేతాలను తెలుసుకుందాం. నిజమైన ప్రేమ ఉన్న వ్యక్తి తనకు ఇష్టమైన వారి కోసం ఎటువంటి త్యాగం చేయడానికి అయినా వెనుకాడడు. వారితో నిజాయితీగా ఉంటాడు. ఇతరులను ఎట్టి పరిస్థితులలోనూ బాధ పెట్టడు. కానీ కానీ నకిలీ ప్రేమ అబద్దాలతో కట్టిన పేక మేడ లాంటిది. నకిలీ ప్రేమను చూపించేవారు వారి అవసరాలను బట్టి, సమయం ప్రకారం ప్రవర్తిస్తారు. మీరు అతనికి అవసరమైనప్పుడు మాత్రమే గుర్తొస్తారు.
READ MORE: Bank Holiday: ఆగస్టులో ఏకంగా 15 రోజులు మూతపడనున్న బ్యాంకులు.. లిస్ట్ ఇదే..
ఇక వారికి ఎప్పుడు పడితే అప్పుడు మూడు స్వింగ్స్ ఉంటాయి. అవసరమైతే సరదాగా మాట్లాడుతారు.. అవసరం తీరిన తర్వాత బిజీగా ఉన్నామని చెప్పి మాట దాటవేస్తారు. అవసరం ఉంటే నాన్ స్టాప్ గా మాట్లాడతారు. అవసరం లేదనుకుంటే చాలా బిజీ ..సారీ అంటారు. కనీసం మెసేజ్ చెయ్యటానికి కూడా టైం లేదని చెప్తారు.నకిలీ ప్రేమ చూపించేవారు ప్రేమను నటిస్తారు. ఎప్పుడు పైపైనే మాట్లాడుతారు. వారికి మనసులో భావాలను అర్థం చేసుకొని అందుకు తగ్గట్టుగా ప్రవర్తించే లక్షణం ఉండదు. నకిలీ ప్రేమ చూపించేవారికి మీ సంతోషం పట్ల, మీ జీవితం పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. మీకు కష్టం కలిగినా వారికి పెద్దగా చింత కూడా ఉండదు. నకిలీ ప్రేమ చూపించే వారు మీలోని భావోద్వేగాలతో ఆడుకుంటారు. మీ వీక్ పాయింట్లను తెలుసుకొని వాటి ఆధారంగా మిమ్మల్ని తన అవసరానికి వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఉత్తుత్తి వాగ్దానాలు చేసి, ఎప్పుడూ ఆ వాగ్దానాలను నెరవేర్చరు. మీ విషయంలో మీకే అభద్రతాభావం కలిగేలా చేస్తారు. తన గురించి మీరు ఎంత పట్టించుకున్నా, మీ గురించి అస్సలు పట్టించుకోరు.
READ MORE: Bank Holiday: ఆగస్టులో ఏకంగా 15 రోజులు మూతపడనున్న బ్యాంకులు.. లిస్ట్ ఇదే..
నిజమైన ప్రేమ లేకపోతే మీరే కాదు, వేరే అమ్మాయిలతో కూడా చెడుగా ప్రవర్తిస్తారు. నకిలీ ప్రేమ చూపించేవారు తన స్నేహితులతోనూ, తన కుటుంబంతోనూ మీరు కలవాలని కోరుకోరు. మీరు వారి కోసం కేటాయించే సమయం వారు మీ కోసం అసలే కేటాయించరు. నకిలీ ప్రేమను చూపించేవారు శారీరక సౌఖ్యం కోసం మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు. మీ సౌకర్యం గురించి అసలే పట్టించుకోరు. ఈ లక్షణాలు ఉన్నవారు మీ జీవితంలోకి వస్తే అసలు నమ్మకూడదు సాధ్యమైనంత వరకు వీళ్లకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ లక్షణాలు ఉన్న వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని నమ్మితే మీరు మోసపోవటం ఖాయం. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి..