లివర్ శరీరంలో ఎంతో అవసరమైన అవయవం, ఎందుకంటే ఎప్పుడైతే ఆహారాన్ని తీసుకుంటే శరీరానికి పోషకాలు ఎలా అయితే అందుతాయో, అనవసరమైన లేక వ్యర్థ పదార్థాలు కూడా ఉంటాయి. అటువంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి లివర్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో ఉండేటు వంటి కెమికల్స్ స్థాయిలను రెగ్యులేట్ చేస్తుంది. అంతేకాకుండా బైల్ జ్యూస్‌ను తయారు చేస్తుంది. ఈ బైల్ జ్యూస్ వల్లనే శరీరంలో ఉండేటు వంటి వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. ఇలా శరీరంలో ఎంతో కీలక పాత్ర పోషించే లివర్‌కు ఏమైన సమస్య వస్తే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే లివర్ ఆరోగ్యం ప్రమాదంతో పడుతుందన్న విషయాన్ని కొన్ని ముందుస్తు లక్షణాల ద్వారా గుర్తించవచ్చు అవేంటంటే..
READ MORE: Kingdom : కింగ్ డమ్ లో కొత్త విలన్.. ఎవరితను..?
లివర్‌లో ఏదైనా సమస్య ఉంటే ముందుగా కనిపించే లక్షణం పొట్ట ఉబ్బడం. లివర్ పనితీరు మెరుగ్గా లేకుంటే ఎప్పుడూ కడుపు ఉబ్బరం ఉన్నట్లు అనిపిస్తుంది. గ్యాస్ సమస్య వేధిస్తుంటుంది. లివర్ చెడిపోతే కొందరిలో కడుపునొప్పి తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా కుడివైపు ఊపిరితిత్తుల కింది భాగంగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరికి వాంతులు కూడా అవుతుంటాయి. ఈ లక్షణాలు ఎక్కువకాలంగా ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. కొందరిలో లివర్ పాడైతే చర్మంపై దురదలు, వాపులు వస్తుంటాయి. కొన్ని సార్లు ఇది చర్మ సంబంధిత సమస్యే అయినా లివర్ పనితీరు పాడవడం ద్వారా కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు.
READ MORE: Gadwal Murder : మరో ఇద్దరితో ఐశ్వర్య ఎఫైర్.. తేజేశ్వర్ కేసులో తెరపైకి సంచలన విషయాలు
దీర్ఘకాలంగా అజీర్ణ సమస్యతో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఆహారం జీర్ణం కావడంలో లివర్ పాత్ర కీలకం. లివర్ పనితీరు దెబ్బతింటే ముందుగా ప్రభావం పడేది జీర్ణ వ్యవస్థపైనే అని గుర్తించాలి. లివర్ దెబ్బతిన్న వారిలో ముందుగా కనిపించే లక్షణాల్లో శరీరం పసుపు రంగులోకి మారడం మరొకటి. చర్మంతో పాటు కళ్లు పసుపు రంగులోకి మారుతుంటాయి. కాబట్టి ఈ మార్పులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. లివర్ సమస్యతో బాధపడేవారిలో కాళ్ల వాపు సమస్య కూడా ఉంటుంది. వాపు ఉన్న చోట నొక్కితే గుంటలా ఏర్పడుతుంటుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.