Localbody Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగ కొనసాగుతోంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు. కాగా ఇప్పటికే రెండవ దశ నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దఫా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
Russian President Vladimir Putin will visit India on December: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. పుతిన్ పర్యటన కోసం భారతదేశంలో సన్నాహాలు జరుగుతున్నాయి. రష్యా సైనిక బృందం చాలా రోజుల క్రితం వచ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తోంది. అయితే.. ఇంతలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. గత 10 సంవత్సరాలుగా పుతిన్ భారత్ సందర్శించిన తీరు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. పదేళ్లలో పుతిన్ ప్రతి పర్యటన ఏడాది చివరిలో కొనసాగింది. దీని వెనుక ఉన్న…
Chittoor: చిత్తూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఇప్పటి వరకు జిల్లాలో 380పైగా కేసులు నమోదయ్యాయి.. స్క్రబ్ టైఫస్ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Russia-India: రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. ఇంతలో ఆ దేశం భారత్‌కు ఓ గిఫ్ట్ ఇచ్చింది. రష్యా పార్లమెంట్ దిగువ సభ అయిన స్టేట్ డూమా భారత్‌తో కీలకమైన సైనిక ఒప్పందమైన రెసిప్రొకల్ ఆపరేషన్స్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ (RELOS)ను అధికారికంగా ఆమోదించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు ముందు ఈ చర్య తీసుకున్నారు. ఈ అంశంపై డూమా స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోడిన్ మాట్లాడుతూ.. భారతదేశంతో రష్యా సంబంధాలు వ్యూహాత్మకం, సమగ్రమైనవని అభివర్ణించారు. ఈ ఒప్పందానికి ఆమోదం పొందడం…
Shadnagar: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ గ్రామపంచాయతీ ఎన్నికల వేళ అపశృతి చోటుచేసుకుంది. ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో ఆవ శేఖర్ అనే యువకుడు రైలు పట్టాలపై అనుమానస్పద రీతిలో మృతి చెందడం సంచలనంగా మారింది. నాల్గవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆవ శేఖర్ మృతదేహం రైలు పట్టాలపై కనిపించడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రైల్వే పోలీసులు గ్రామస్థులకు అందించిన సమాచారం ప్రకారం.. రైలు పట్టాలపై పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహం వద్ద…
Jagtial: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ స్థానానికి తల్లీకూతుళ్లు పోటీకి దిగారు. తల్లి గంగవ్వ, కూతురు పల్లెపు సుమ నామినేషన్ దాఖలు చేశారు. తిమ్మయ్యపల్లి సర్పంచ్ స్థానం బీసీ మహిళ రిజర్వ్ చేశారు. పల్లెపు సుమ అదే గ్రామానికి చెందిన అశోక్‌ను 2017లో ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఇరు కుటుంబ మధ్య కలహాలు మొదలయ్యాయి. మొన్నటి వరకు సుమ తండ్రి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేశారు. తల్లికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపగా కూతురుకు…
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సంబరాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఏకగ్రీవాలు మిన్నంటాయి. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊర్లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. సీఎం సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సర్పంచ్‌గా మాజీ మావోయిస్టు, మల్లేపాకుల వెంకటయ్య (అలియాస్ మోహన్)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా ఈ విషయంలో చొరవ తీసుకుని గ్రామస్థులతో చర్చించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి, సర్పంచ్ పోటీకి అనేక మంది ఉత్సాహం చూపారు. అయితే.. చివరకు సీఎం…
Abhishek Sharma: టీమిండియా స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ మరోసారి రెచ్చిపోయాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో సంచలనం సృష్టించాడు. పంజాబ్ తరుఫున ఆడుతున్న అభిషేక్ ప్రత్యర్థి బెంగాల్ జట్టుకు చుక్కలు చూపించాడు. నేడు నవంబర్ 30 ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 52 బంతుల్లో 16 సిక్సర్లు, 8 ఫోర్లతో సహా 148 పరుగులు చేశాడు. ఇది అభిషేక్ శర్మకు T20 క్రికెట్లో ఎనిమిదో సెంచరీ. 157 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు ఈ స్టార్…
Pakistan vs Sri Lanka: తాజాగా పాకిస్థాన్ జట్టు శ్రీలంక జట్లు మధ్య టీ20 సిరీస్ ముగిసింది. పాక్ T20I ట్రై-సిరీస్‌ను గెలుచుకుంది. నవంబర్ 29వ తేదీ శనివారం రావల్పిండిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక 115 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది పాక్.. ఈ మ్యాచ్ లో థర్డ్ అంపైర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం పెద్ద సమస్యగా మారింది. ఇది పాక్ ఆటగాళ్లు ఫఖర్…
Sarpanch Qualities: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు విడతల్లో (డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17) సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నేటి నుంచి రెండో విడత మొదలు కానుంది. అయితే.. అసలు సర్పంచ్ ఎలా ఉండాలి..? ప్రజలకు సేవ చేసే గుణం మీ సర్పంచ్ అభ్యర్థిలో ఉందా..? ఈ పది పాయింట్స్…