-
Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
Indian Cricketers Who Married Older Women: భారత క్రికెట్లో రికార్డులు సృష్టించడం, తుడిచిపెట్టుకుపోవడం సర్వసాధారణం. అయితే మైదానంలో బౌండరీల వర్షం కురిపించే క్రికెటర్లు, తమ వ్యక్తిగత జీవితాల్లో తీసుకున్న నిర్ణయాల్లోనూ ప్రత్యేకంగా నిలిచారు. సాధారణంగా సమాజంలో భార్య కంటే భర్త వయస్సు ఎక్కువగా ఉండాలనే నమ్మకం ఉంది. కానీ భారత క్రికెట్ దిగ్గజాలు కొందరు ఈ సాంప్రదాయ ఆలోచనలను, సామాజిక కట్టుబాట్లను పక్కనపెట్టి, మనసుకు నచ్చిన బంధానికే ప్రాధాన్యత ఇచ్చారు. తమ కంటే వయస్సులో పెద్దవారైన […] -
Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
Nepal Violence: భారత్‌కు సరిహద్దున ఉన్న నేపాల్‌లోని సున్సరి జిల్లాలో జూలై 26న చోటుచేసుకున్న కోమల ఘర్షణల వెనుక పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సున్సరిలోని దేవ్‌గంజ్ గ్రామీణ పురపాలక పరిధిలోని కప్తాన్‌గంజ్ ప్రాంతంలో మతపరమైన జెండాలు, ఎక్కువ సౌండ్‌తో డీజే ప్లే చేయడంపై రెండు వర్గాల మధ్య మొదలైన చిన్న వివాదం తీవ్ర హింసాత్మకంగా మారింది. పరిస్థితి చేయిదాటడంతో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ హింస ఇతర… -
Google Pixel 11 Series: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు..
Google Pixel 11 Series: గూగుల్ సంస్థ భారత్‌లో తన సరికొత్త 'పిక్సెల్ 11' సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. MadeByGoogle ఈవెంట్‌కు ముందే ప్రెస్ రిలీజ్ ద్వారా ఈ లాంచ్‌ను ప్రకటించిన కంపెనీ, ఫోన్ల ధరలను కూడా వెల్లడించింది. ఈ సిరీస్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్, ఫోల్డబుల్ మోడల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ అనే నాలుగు ప్రీమియం స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈసారి గూగుల్ పూర్తి దృష్టిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పైనే… -
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
Ajinkya Rahane-IND vs SL: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 (శనివారం) నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ సమరానికి తెరలేవనుంది. గాల్ వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న టీమిండియా, పర్యటనను విజయంతో ఘనంగా ప్రారంభించాలని పట్టుదలతో ఉంది. ఆగస్టు 15 నుంచి 27 వరకు సాగే ఈ సిరీస్ క్రికెట్ ప్రేమికులకు మంచి వినోదాన్ని పంచనుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో ఒక ప్రత్యేక ఆకర్షణ అభిమానులను అలరించబోతోంది. -
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
DY Chandrachud: భారతదేశ పూర్వ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ అంతర్జాతీయ న్యాయ వేదికపై ఒక కీలకమైన బాధ్యతను స్వీకరించనున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ యాజమాన్యంలోని 'ఓస్చాడ్‌బ్యాంక్' (Oschadbank) రష్యాపై దాఖలు చేసిన భారీ అంతర్జాతీయ వివాదంలో రష్యా దేశం తరఫున ఆయన ఆర్బిట్రేటర్‌గా ప్రాతినిధ్యం వహించనున్నారు. 'గ్లోబల్ ఆర్బిట్రేషన్ రివ్యూ' నివేదికను ఉటంకిస్తూ బార్ అండ్ బెంచ్ ఈ వివరాలను వెల్లడించింది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన పూర్తిస్థాయి సైనిక చర్యల కారణంగా డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాల్లోని తమ… -
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా రేవంత్ రెడ్డి? తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం GRMB ఎజెండాలో పెడితే.. ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదు? అని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని ఏపీ ప్రతిపాదిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెంటనే అభ్యంతరం చెప్పలేదని ఎక్స్ పోస్ట్‌లో ప్రశ్నించారు. ఎందుకు GRMBని నిలదీయలేదు? ఎందుకు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు? బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాత హడావుడిగా లేఖలు రాయడం తప్ప.. తెలంగాణ ప్రయోజనాల… -
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
Akhil NRD Wife Megha Controversy: మలయాళ పాపులర్ యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ అఖిల్ ఎన్ఆర్డీ జీవితం ఒక్కసారిగా వివాదాల్లోకి నెట్టబడింది. ఎంతో సంతోషంగా సాగిపోతోందనుకున్న వివాహ బంధం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడింది. అఖిల్ భార్య మేఘ ఆయనను వదిలేసి, ఒక బస్సు కండక్టర్‌తో వెళ్లిపోవడంతో ఈ అంశం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. ఆ కండక్టర్‌కు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం రావడంతోనే మేఘ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అఖిల్ వీడియోల ద్వారానే మేఘ సోషల్ మీడియా ప్రపంచానికి… -
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
Hardik Pandya: ఐపీఎల్ 2027 ట్రేడింగ్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై నెట్టింట ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌లో 2024లో తిరిగి చేరిన హార్దిక్‌కు జట్టు యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. -
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు అటవీ ప్రాంతంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అటవీ ప్రాంతంలో కొంతమంది వేటగాళ్లు వైర్లు అమర్చి అడవి జంతువుల కోసం ఉచ్చులు ఏర్పాటు చేశారనే సమాచారం ఫారెస్ట్ కార్యాలయానికి రావడంతో, ఆరుగురు సిబ్బంది కలసి అటవీ ప్రాంతంలోకి తనిఖీల కోసం నడుచుకుంటూ వెళ్లారు. బూర్గంపాడు మండలం నకిరేపేట […] -
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
Shubman Gill: శ్రీలంకతో గాల్ వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌లో భారత జట్టును యువ స్టార్ శుభ్‌మన్ గిల్ నడిపించబోతున్నాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గిల్‌కు ఈ సిరీస్ ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకునే సువర్ణావకాశం లభించింది. ఈ రెండు మ్యాచ్‌లలో గిల్ మరో 157 పరుగులు చేస్తే చాలు, డబ్ల్యూటీసీ చరిత్రలోనే 3000 పరుగుల మార్కును అందుకున్న తొలి భారతీయ బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.
తాజావార్తలు
-
Abhishek Sharma Records: అఫ్గాన్‌పై రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?