జర్నలిజం డెఫినేషన్ మారిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జర్నలిజం వృత్తిలో ఉన్నవాళ్లు తమ బాధ్యతను మరవకూడదన్నారు. సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్నా వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను వేరే చేయాలని.. వాళ్లను వేరుగా కూర్చోబెట్టాలని పాత్రికేయులకు సీఎం విజ్ఞప్తి చేశారు. వాళ్లు, మీరు ఒక్కటి కాదన్న భావనను ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ రోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు జర్నలిస్ట్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. పెన్ను పేపర్ ఇస్తే ఏబీసీడీలు కూడా రాయలేని వారు కూడా నేను జర్నలిస్ట్‌ని అంటారన్నారు. ఏం జర్నలిస్ట్ అని అడిగితే సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటున్నారు. పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటారు అదేదో వాళ్ల ఇంటిపేరు అయినట్టు అంటూ వ్యాఖ్యానించారు.
READ MORE: Chiranjeevi Birthday: ‘మెగా’ బ్లాస్టింగ్ లోడింగ్.. చిరంజీవి బర్త్ డేకి అదిరిపోయే అప్డేట్స్!
“వాళ్ల తాతలు, ముత్తాతల నుంచి జర్నలిజంలోనే పుట్టి పెరిగినట్టు. జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్యా అని పెట్టుకుంటున్నారు. వాడు ఎప్పుడైన జర్నలిజం స్కూల్‌లో చదివిండా? లేకపోతే ఓనమాలు మొత్తం అయినా వస్తాయా అంటే రెండూ రావు. ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అయిన జర్నలిస్టులు ఉండేవాళ్లు. లేదా జర్నలిజం చదివిన వాళ్లకు ఈ బాధ్యతలు ఇచ్చే వాళ్లు. వాళ్ల పనితనాన్ని బట్టి వాళ్లకు బాధ్యత పెంచేవాళ్లు. కానీ ఈ రోజు అదేమీ లేదు. రోడ్లమీద ఆవారా గా తిరిగేటోడు .. ఎక్కువ తిట్లొచ్చినోడు, ఏందంటే అదే మాట్లాడేటోడే జర్నలిజం అనే ముసుగు తొడుక్కొని అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చాయి. ఇలా జర్నలిజం ముసుగులో కొందరు ప్రెస్‌మీట్‌లు పెట్టినప్పుడు ముందలి వరుసలో ధిక్కారంగా కూర్చుంటారు. మనమేదో లోకువ అయినట్టు, వాళ్లేదే పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్లు మన కళ్లలోకి చూస్తుంటారు. ఇంకా నన్ను చూసి నమస్కారం పెడతలేవు. నన్ను చేసి ఇంకా తల వంచుకుంటలేవు అని చూస్తుంటాడు. స్టేజీ దిగిపోయి పల్ల పల్ల చెంపలు పగులగొట్టాలని నాకు అనిపిస్తది. కానీ, పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంది.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.