రైలు ప్రమాదం ఈ పేరు వింటేనే కొందరికి భయమేస్తోంది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని సాంకేతిక లోపాలు, తదితర కారణాల వల్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద రైలు ప్రమాదం ఏదో తెలుసా? దాదాపు 1700 మందిని బలిగొన్న ఈ ప్రమాదం శ్రీలంకలో చోటు చేసుకుంది. 2004లో జరిగిన ఈ దుర్ఘటన ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
READ MORE: National Film Awards 2025: హను-మాన్ సినిమాకు రెండు, బలగంకు ఓ అవార్డ్.. తెలుగు ఫుల్ లిస్ట్ ఇదే!
ఈ రైలు ప్రమాదం 26 డిసెంబర్ 2004న శ్రీలంకలో సముద్రాదేవి అనే రైలు కొలంబో నగరం నుంచి గాలే నగరానికి వెళుతోంది. రైలు ఉదయం 6.30 గంటలకు కొలంబోలో స్టార్ట్ అయ్యింది. సముద్రానికి 200 మీటర్ల దూరంలోని శ్రీలంక నైరుతి తీరానికి సమీపంలో ఉన్న తెల్వాట్ట గుండా ప్రయాణించింది. తెల్వత్తా సమీపంలోని పెరలియా గ్రామానికి డిసెంబర్ 26 ఉదయం 9.30 గంటలకు ఈ రైలు చేరుకుంది. ఆ సమయంలో హిందూ మహాసముద్రలో భారీ భూకంపం సంభవించింది. తెల్వట్ట సమీపంలోని పెరాలియా వద్ద ఉన్న నైరుతి తీర రైల్వే లైన్‌లో ఈ రైలు నిలిచింది. సునామీ కారణంగా మొదట రైలులోకి భారీగా నీరు చేరింది. దీంతో ప్రయాణికులు కంగారు పడుతూ.. రైలు పైకి ఎక్కారు. ఈ సారి బలంగా వచ్చిన అలల ధాటికి రైలు సముద్రంలోకి కొట్టుకుపోయింది. 900 మృత దేహాలను వెలికితీయగా.. 150 మందిని రక్షించారు. రైలులోని ఎనిమిది బోగీల్లో ఉన్న ప్రయాణికులందరూ చనిపోయారు. ఈ ప్రమాదంలో 1700 మంది మరణించారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటీ… 2వేలకు పైగా మృత్యువాత పడ్డారని మీడియా సంస్థలు అభిప్రాయపడ్డాయి.
READ MORE: Bride: నిత్య పెళ్లికూతురు.. 8 మందితో వివాహం, 9వ పెళ్లిలో పట్టుబడిన మహిళ..
ఇదిలా ఉండగా.. మన దేశ చరిత్రలోనే అతి పెద్ద రైలు ప్రమాదం జూన్ 6, 1981న బీహార్‌లో జరిగింది. తుపాను సమయంలో రైలు బాగ్‌మతి నది బ్రిడ్జ్ దాగుతుండగా బోగీలు నదిలో పడిపోయాయి. రెండు రోజుల తర్వాత.. 200 దాకా మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదు రోజుల తర్వాత 235 మంది మరణించారని, ముగ్గురి జాడ తెలియరాలేదని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. కానీ, వందల మంది తమ వాళ్ల జాడ లేదంటూ మీడియా ముందుకు వచ్చారు. నది ఉధృతికి వాళ్లంతా కొట్టుకుపోయి ఉండొచ్చనే భావించారంతా. ఈ ఘటనలో సుమారు ఏడు నుంచి 800 మంది మరణించి ఉండొచ్చని అంచనా వేశారు.