Hair Care Tips: ఒత్తైన, నల్లని కురులు సొంతం చేసుకోవాలని ప్రతి అమ్మాయి, అబ్బయిలూ ఆరాటపడుతుంటారు. అయితే మనం రోజూ చేసే కొన్ని పనుల వల్ల మనకు తెలియకుండానే కేశాలకు హాని కలుగుతుంది. ఫలితంగా జుట్టు రాలడం, చివర్లు చిట్లడం, నిర్జీవంగా మారడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. మరి, ఆ పొరపాట్లేంటో తెలుసుకుని సరిదిద్దుకుంటే కురులను చక్కగా సంరక్షించుకోవచ్చు. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల జుట్టు రాలడం ఆపొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
READ MORE: IND vs ENG: పెవిలియన్కు వరుస పెట్టిన టీమిండియా బ్యాటర్లు.. భారత్ 224 ఆలౌట్!
జుట్టు రాలడానికి ఆహారంలోని ఏ నిర్ధిష్ట అంశాలు కారణం అవుతున్నాయో కచ్చితంగా తెలియకపోవచ్చు. కానీ, ఉదాహరణకు అధిక చక్కెరలు, సంతృప్త కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలతో గుండె సంబంధిత వ్యాధులు రావడం మాత్రమే కాకుండా మన కణాల్లో ఒత్తిడి, ఇన్‌ఫ్లమేషన్ కలుగుతుంది. దీనితో మన శరీరం మరింత సున్నితంగా మారి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. వాటిలో జుట్టు రాలడం కూడా ఒకటి. ప్రొటీన్లు, బి విటమిన్, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు అధికంగా ఉండే కొన్ని రకాల ఆహార పదార్థాలు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి చాలా కీలకం. అనోరెక్సియా (తక్కువ బరువు ఉండటం), బులీమియా (అతిగా తినడం) వంటి ఆహార రుగ్మతలకూ జుట్టు రాలడానికి మధ్య బలమైన సంబంధం ఉంటుంది.
READ MORE: Ambati Rambabu: మీ కుటుంబం చరిత్ర మాకు తెలియదా?.. హోం మంత్రిపై అంబటి రాంబాబు ఫైర్
చేపలు, వర్జిన్ ఆలివ్ ఆయిల్ వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇన్‌ఫ్లమేషన్ కలిగించే ఆహారానికి దూరంగా ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కొన్ని తార్కిక వివరణలు చెబుతున్నాయి. అనేక అధ్యయనాలు కూడా ఇందుకు మద్దతు ఇస్తున్నాయి. ఉదాహరణకు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే మెడిటరేనియన్ డైట్(తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, విత్తనాలు, ఆరోగ్యకర కొవ్వులతో కూడిన ఆహారం)ను పాటిస్తే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కొందరు చెబుతున్నారు.