ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ పరిధి బితూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రతన్ ప్లానెట్ అపార్ట్‌మెంట్స్‌లో పార్కింగ్ విషయంపై గొడవ జరిగింది. ఈ చిన్న వివాదం భయంకరమైన మలుపు తిరిగింది. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో.. ఓ యువకుడు అపార్ట్మెంట్ కార్యదర్శి, రిటైర్డ్ ఇంజనీర్ ముక్కు కొరికాడు. ఈ వార్త ప్రస్తుతం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, 35 ఏళ్ల మహిళ తన మైనర్ మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతే కాకుండా అతనితో కలిసి జీవించాలని పట్టుబడుతోంది. అతడే తన భర్త అని చెబుతోంది. మైనర్ బాలుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. మైనర్ వయస్సు ధృవీకరణ పత్రం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అమెరికా వీధుల్లో ఏర్పాటు చేసిన 'మేడ్ ఇన్ ఇండియా' మ్యాన్‌హోల్ కవర్ల చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే అంశంపై చర్చ జరుగుతోంది. భారతదేశంలో తయారు చేసిన మ్యాన్‌హోల్ కవర్ అక్కడి రోడ్ల వద్దకు ఎలా చేరుకున్నాయి.? అనే చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమైంది.
వయసులో ఉన్న యువతి, యువకుడు పెళ్లి చేసుకుని సంసారం చెయ్యడం సర్వసాధారణం. వివాహం చేసుకున్న తరువాత దంపతుల మధ్య గొడవలు రావడం, విడిపోవడం ప్రతిరోజు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ భలే గమ్మత్తు అయిన విషయం వెలుగు చూసింది. 40 ఏళ్ల ఆంటీని ఓ పాతికేళ్ల యువకుడు పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్థక కారణంగా ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.
మిస్ వరల్డ్ పోటీలపై వచ్చిన సంచలన ఆరోపణల్లో నిజమెంతో తేల్చేందుకు డీజీ శిఖాగోయెల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు సీనియర్ ఐపీఎస్‌లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. రెమా రాజేశ్వరి, సైబరాబాద్ ఎస్బీ డీసీపీ సాయి శ్రీ నేతృత్వంలో కమిటీ విచారణ చేపట్టింది. పోటీల నిర్వహణపై కంటెస్టెంట్ల నుంచి సమాచారం సేకరిస్తుంది. మిల్లా మాగీ ఆరోపణల్లో నిజమెంతన్నదిపై దర్యాప్తులో తేలనుంది. READ MORE: Honeytrap: వృద్ధుడితో 28 ఏళ్ల యువతి అసభ్యకర చేష్టలు.. […]
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 61 ఏళ్ల వృద్ధుడితో 28 ఏళ్ల యువతి హనీ ట్రాప్ కేసు సంచలనం సృష్టించింది. ఈ వివరాలు విన్న పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. బాధిత వృద్ధుడి అశ్లీల వీడియోను తీసి.. రూ.50 లక్షలు డిమాండ్ చేసిందని ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 28 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు.
జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో హృదయ విదారక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. చెనాని ప్రాంతంలోని లడ్డా గ్రామంలో ఓ సంచిలో కుళ్ళిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఓ షాకింగ్ విషయం బయటపడింది. భర్తను భార్య, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దారుణంగా హత్య చేసినట్లు తేలింది. ఈ సంఘటన గురువారం జరిగింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
“మన్ కీ బాత్” లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీ ప్రస్తావించారు. “డ్రోన్ దీదీలు” తెలంగాణలో వ్యవసాయంలో పెను మార్పులు తీసుకొస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మహిళలు డ్రోన్లతో వ్యవసాయం చేయడాన్ని మోడీ ప్రశంసించారు. "గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొందారు. పండ్ల తోటలకు పురుగుమందులు, శీల్దార పిచికారీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులకంటే వేగంగా, సమర్థవంతంగా పురుగుమందులను పిచికారీ చేయవచ్చు. నీటిని, మందుల వినియోగాన్ని 30–40 శాతం వరకు తగ్గించవచ్చు.
మేము ఆ రెండు పార్టీలకి జవాబు దారి కాదని కాంగ్రెస్, బీఆర్ఎస్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎన్ని తిట్టినా తమకు పోయేదేమీ లేదని స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు పార్టీలో ఒకరికొకరు ఒప్పందం కుదుర్చుకొని బీజేపీపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దోచుకుంటున్నారని విమర్శించారు.