తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పర్యటనలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒకటో తారీకు వస్తే పండగ వాతావరణం నెలకొంటుందని.. వైసీపీ పాలనలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేందుకు ఐదేళ్లు పట్టిందన్నారు. జగన్ పింఛన్లు పెంచుతామని ప్రజలను మోసం దగా చేశారని.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి విషమంగా ఉన్న పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నామని తెలిపారు. ఏడాది పాలనలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం చేస్తున్నామన్నారు. ఓటమి నుంచి పాటలు నేర్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి అదే విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టి 2047 కి రాష్ట్రాన్ని ప్రపంచంలోనే తెలుగుజాతిని అగ్రస్థానంలో ఉంచాలని కృషి చేస్తున్నారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేయాలని ఆలోచించడం దురదృష్టకరమన్నారు. గంజాయి బ్యాచ్లకు బ్లేడ్ బ్యాచ్లకు బెట్టింగ్ బ్యాచ్లకు పరామర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అవినీతిలో భాగస్వాములై, ప్రజలను లూటీ చేసి జైల్లో ఉన్న వ్యక్తులను జగన్ పరామర్శిస్తున్నారు.. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని, వాటి గురించి మాట్లాడే అర్హతయే జగన్ కు లేదని విమర్శించారు.
READ MORE: Srushti Case : కస్టడీ విచారణలో షాకింగ్ కామెంట్స్ చేసిన డాక్టర్ నమ్రత
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వచ్చేవారు కాదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. “ఒకవేళ బయటకు వస్తే ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్టులు చేసేవారు. ఐదేళ్లపాటు కక్షలు వేధింపులు పాలనను ఎవ్వరూ మర్చిపోలేదు. జగన్ కు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు. ఐదేళ్లపాటు ఒక హిట్లర్ ముషారఫ్ వంటి వ్యక్తులు కూడా అసూయపడేలా పాలన చేశారు. ఐదేళ్ల జగన్ పాలన నుంచి ప్రజలు విముక్తి పొందారు. 1947లో బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం లభిస్తే 2024లో రాక్షస పాలన నుంచి విముక్తి పొంది ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. జగన్ దొంగ ఏడుపులను అబద్దాలను నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు. అన్యాయం గా అరెస్టు చేస్తున్నారంటూ జగన్ మాట్లాడటం హాస్యాస్పదం. చట్టం తన పని తాను చేసుకోని వెళ్తుంది. తప్పు చేసిన వారే జైల్లో ఉన్నారని కక్ష సాధింపుగా ఎవరిని జైల్లో పెట్టలేదు. మిథున్ రెడ్డిని కూడా కూటమి అధికారంలోకి వచ్చాక జైల్లో పెట్టలేదని సంవత్సరం పాటు విచారణ దర్యాప్తు చేసి ఆధారాలు అన్నిటిలతోనే అరెస్టు చేశాం. అరెస్టు అవకుండా మిథున్ రెడ్డి న్యాయస్థానానికి వెళితే అవి కూడా తిరస్కరించాయి. ప్రజల సొమ్ములను లూటీ చేసారని ఆధారాలు ఉండబట్టే కోర్టులు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించాయి. ప్రైవేట్ చేతిలో ఉండే లెక్కల వ్యాపారాన్ని జగన్ తన చేతిలోకి తీసుకున్నారా లేదా చెప్పాలి. బ్రాందీ అమ్మకం సర్కార్ పేరు మీద జగన్ చేతిలో ఉందో లేదో చెప్పాలి. రోడ్డు పక్కన అమ్మే జామకాయలు బండి దగ్గర కూడా ఫోన్ పే ఉంటుందని, సర్కార్ నిర్వహించే బ్రాందీ షాపుల్లో ఎందుకు ఫోన్ పే పెట్టలేదు. ఐదేళ్లపాటు సర్కార్ పేరు చెప్పి విచ్చలవిడిగా ప్రజల సొమ్ము లూటీ చేశారు. వైసీపీ పాలనలో జగన్ వెనకేసిన కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెనక్కి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం పని చేస్తుంది.” అని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు.