Trump Slaps 50% Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై టారిఫ్ బాంబు పేల్చారు. బుధవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. ఇంతకు ముందు ప్రకటించిన 25% సుంకాలకు మరో 25% యాడ్ చేశారు. 50% సుంకాలు పెంచుతూ.. కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. భారత్‌పై మొత్తం 50% సుంకాన్ని అమెరికా ప్రకటించింది.
READ MORE: AB Venkateswara Rao: పోలవరం – బనకచర్లపై ఏబీ వెంకటేశ్వరరావు హాట్ కామెంట్లు..
నిజానికి.. గతంలో అమెరికా భారత్‌పై 25 శాతం సుంకం మాత్రమే ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే టారిఫ్ పెంపునకు ప్రధాన కారణమని ట్రంప్ స్పష్టం చేశారు. కానీ తన మనసు మర్చుకున్న ట్రంప్ మరో 25% అదనంగా యాడ్ చేశారు. ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వు ప్రకారం.. ఈ సుంకం 21 రోజుల్లోపు, అంటే 2025 ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ఈ కొత్త సుంకం వర్తిస్తుంది. అయితే.. ఈ తేదీకి ముందు బయలుదేరి 2025 సెప్టెంబర్ 17 కి ముందు అమెరికాకు చేరుకున్న వస్తువులు ఈ సుంకం నుంచి మినహాయింపు కల్పించారు. ఇప్పటికే ఉన్న పన్నులకు ఈ సుంకం అదనమని.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపు ఇస్తామని యూఎస్ ప్రకటించింది.
READ MORE: AB Venkateswara Rao: పోలవరం – బనకచర్లపై ఏబీ వెంకటేశ్వరరావు హాట్ కామెంట్లు..