వారం రోజులైనా యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ జాడ తెలియలేదు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగగాని యూట్యూబర్ సన్నీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో రహస్య ప్రాంతంలో సన్నీ బయ్యను విచారిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. జ్యోతి మల్హోత్ర, సన్నీలను కలిపి ఎన్ఐఏ విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు.
రక్తహీనత అంటే శరీరంలో రక్తం లేకపోవడం. ఇది సాధారణంగా మహిళలతో కనెక్ట్ చేయడం ద్వారా మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది మహిళల్లో హిమోగ్లోబిన్ అవసరం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. స్త్రీల శరీరంలో రక్తహీనతకు సరైన పోషకాహారం లేకపోవడం ప్రధాన కారణం. పీరియడ్స్ సమయంలో కూడా మహిళలు ప్రతినెలా చాలా రక్తాన్ని కోల్పోతారు.
తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యూపీఎఫ్ నిలిచింది. యూపీఎఫ్ నూతన కార్యవర్గంఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. కన్వీనర్ గా బొల్లా శివశంకర్, అడ్వైజర్ గా గట్టు రామచందర్ రావును నియమించారు. అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్ నాయకులతో కవిత సమావేశం నిర్వహించారు. త్వరలోనే బీసీ బిల్లులు సాకారం అయ్యేందుకు కార్యచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన జనాల పైనే రేవంత్ రెడ్డి తన ప్రతాపం చూపిస్తున్నారని.. హైడ్రా తో ఇళ్లను కూలగొట్టడం, రైతుల ధాన్యం కొనక పోవడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రసవానికి వచ్చిన గర్భిణి, అప్పుడే పుట్టిన బాబు మృతి చెందారు. స్టాఫ్ నర్స్ గర్భిణీ స్ర్తీకి డెలివరి చేసింది. ఆయమ్మ సహాయంతో.. ఇద్దరూ కలిసి డెలివరి చేయడంతో తల్లి, బిడ్డ పరిస్థితి విషమంగా మరి మృత్యువాత పడ్డారు..
ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈ కేసులో కీలక సూత్రధారి ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేస్తున్నాడు.. ఈనెల 5వ తేదీలోగా హైదరాబాద్‌కు వస్తున్నట్లు పేర్కొన్నాడు..హైదరాబాద్‌కు చేరుకున్న మూడు రోజులు తర్వాత విచారణ అధికారుల ఎదుట హాజర అవుతారని చెప్పారు.. సంబంధించి ప్రాసెస్ ప్రారంభమైనట్లు అనుచర వర్గాలు చెప్తున్నాయి.. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్ ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది..
రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం తోపాటు కృత్రిమ మేధ ( ఏఐ) సేవలను ఉపయోగించుకొని ప్రజలకు మరింత సులువైన సమర్థవంతమైన సేవలను అందించబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజ మహాంకాళి బోనాల జాతర ఉత్సవాలు జులై 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం 117వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
చౌక ధరల దుకాణాలు మళ్ళీ తెరుచుకుంటున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూన్ 1 నుంచి 29,760 చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు అందించబోతున్నామని స్పష్టం చేశారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.