India’s SuperGaming: భారతీయ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ సంచలనం.. రూ. 132 కోట్ల సేకరణ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s SuperGaming Raises: భారతీయ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ సూపర్‌గేమింగ్ తాజా రౌండ్ నిధులలో US $15 మిలియన్లను సేకరించింది. ఈ మొత్తాన్ని భారత కరెన్సీలోకి మారుస్తే, రూ.132 కోట్లు అవుతుంది. ఈ కంపెనీ మాస్క్‌గన్, ఇండస్ బాటిల్ రాయల్ వంటి భారతీయ షూటింగ్ గేమ్‌లను తయారు చేస్తుంది. రౌండ్ నిధులు అంటే.. సంస్థ లేదా స్టార్టప్ తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరించే ప్రక్రియ. ఎంతో నమ్మకం ఉంటే గానీ కంపెనీల్లో జనాలు పెట్టుబడి పెట్టారు. కానీ.. కంపెనీ తాజా రౌండ్‌లో అందుకున్న ఈ నిధి విలువ నాలుగేళ్ల నాటి విలువ కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. తాజాగా దాదాపు 100 మిలియన్ యూఎస్ డాలర్లు సేకరించింది. ఈ సమాచారాన్ని కంపెనీ ఉన్నతాధికారులు అందించారు. సూపర్ గేమింగ్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు రాబీ జాన్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. కంపెనీ 2021లో US$21 మిలియన్ల విలువతో US$5 మిలియన్లను సేకరించిందని చెప్పారు.
READ MORE: Ghaati Trailer: సీతమ్మోరు లంకా దహనం చేస్తే? అనుష్కకి మరో అరుంధతి దొరికిందిగా!
Also Read
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఈ పెట్టుబడిలో స్కైక్యాచర్, స్టీడ్‌వ్యూ క్యాపిటల్ ముందంజలో ఉన్నాయి. వాటితో పాటు a16z స్పీడ్‌రన్, బందాయ్ నామ్కోకి చెందిన 021 ఫండ్, నియోవిజ్, పాలిగాన్ వెంచర్స్ వంటి వెబ్3 పెట్టుబడిదారులు ఉన్నారు. మాస్క్‌గన్, ఇండస్ బాటిల్ రాయల్ వంటి భారతీయ షూటింగ్ గేమ్‌లను తయారు చేసే సూపర్‌గేమింగ్ కంపెనీ ఈ నిధిని తమ కార్యకలాపాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు ఉపయోగించనుంది. సొంతంగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకునే సౌకర్యం లేని దేశాలలో గేమ్ డెవలపర్లు, ప్రచురణకర్తలకు సహాయం చేయడమే ఈ కంపెనీ లక్ష్యం . సూపర్ గేమింగ్ తన ప్రపంచ విస్తరణలో భాగంగా మొదట లాటిన్ అమెరికాలో తన గేమ్‌ను ప్రారంభిస్తుంది. దీని కోసం, ఇది LOUD.GGతో భాగస్వామ్యంపై పనిచేస్తోంది.
READ MORE: CM Chandrababu: మంత్రులకు సీఎం దిశానిర్దేశం.. ఇక నుంచి దూకుడు పెంచాలి..!
తాజావార్తలు
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!