Hyderabad: వీకెండ్ వచ్చిందంటే చాలు… హైదరాబాద్ శివారు బాట పడుతున్న యువత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ సిటీలో నిఘా ఎక్కువైందని.. శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకున్నారు. డ్రగ్ పార్టీల కోసం ఫాం హౌజ్‌లు, రిసార్ట్‌లు అద్దెకు తీసుకుంటున్నారు. బర్త్ డే.. గెట్ టుగెదర్.. వీకెండ్ ఔటింగ్… అంటూ పార్టీల పేరుతో డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా 10 రోజుల వ్యవధిలోనే 2 డ్రగ్ పార్టీలపై దాడులు చేశారు పోలీసులు. యువకుల వద్ద పెద్ద ఎత్తున్న డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు గబ్బు పట్టిస్తున్న పబ్బులపైనే ఫోకస్ పెట్టిన పోలీసులు.. ఇప్పుడు నగర శివారులపైనా దృష్టిపెట్టారు. వీకెండ్ వచ్చిందంటే చాలు… హైదరాబాద్‌లో శివారు బాట పడుతున్నారు కొందరు యువకులు. ఎంజాయ్‌మెంట్ పేరుతో ఫామ్ హౌజ్‌లు, రిసార్ట్‌లకు వెళ్తున్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి లిక్కర్ పార్టీ చేసుకునేది కొందరైతే… కేవలం డ్రగ్ పార్టీలు చేసుకునేందుకు వెళ్తున్న వాళ్లు మరికొందరు. నగరంలో గంజాయి, డ్రగ్స్‌ను వెంటాడుతున్నాయి ఈగల్ టీమ్స్. అడుగడుగునా గంజాయి, డ్రగ్స్ సరఫరాకు చెక్ పెడుతున్నారు. దొరికితే తాట తీస్తున్నారు. దీంతో… మత్తురాయుళ్లు సిటీ శివారులను అడ్డాలుగా మార్చుకుంటున్నారు..
READ MORE: Newly Married Women’s Suicides: వధువులకు నరక ప్రాయంగా మారుతున్న పెళ్లిళ్లు..!
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
తాజాగా చేవెళ్ల పరిధిలో ఉన్న ఓ ఫామ్ హౌజ్‌లో కొందరు యువకులు… డ్రగ్ పార్టీ నిర్వహిస్తుండగా పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. పెద్ద ఎత్తున్న డ్రగ్స్, హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. వీకెండ్.. దీనికి తోడు.. ఫ్రెండ్ షిప్ డే… ఓ యువకుడి బర్త్ డే… అన్నీ కలిసొచ్చాయని ఫామ్ హౌజ్‌ను బుక్ చేసుకుని డ్రగ్ పార్టీ చేసుకున్నారు యువకులు. హైదరాబాద్‌కి చెందిన యువకులు అభిజిత్ బెనర్జీ, సింప్సన్, పార్థు, గోయల్, యశ్వంత్ రెడ్డి, సెవియో డెన్నిస్ స్నేహితులు. వీళ్లంతా వేర్వేరు కంపెనీల్లో ఐటీ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అభిజిత్ రెడ్డి పుట్టిన రోజు కావడంతో స్నేహితులంతా పార్టీ అడిగారు. ఎలాగో ఫ్రెండ్ షిప్ డే కూడా ఉండటంతో వీకెండ్‌లో కలుద్దామని ఫిక్స్ అయ్యారు. మొయినాబాద్ మండలం మేడిపల్లిలోని సెరీన్ ఆర్చర్డ్స్ ఫామ్ హౌజ్‌ను బుక్ చేసుకున్నారు. బర్త్ డే పార్టీని కాస్తా… డ్రగ్ పార్టీగా మార్చారు. LSD బ్లాస్ట్స్, హాష్ ఆయిల్ తోపాటు పెద్ద ఎత్తున లిక్కర్ తీసుకెళ్లారు. స్నేహితులంతా కలిసి డ్రగ్ పార్టీ చేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు… ఫామ్ హౌజ్ పై రైడ్ చేశారు. డ్రగ్స్, హాష్ ఆయిల్, లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. యువకులను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ టెస్టులు చేయగా.. యువకులకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఫామ్ హౌజ్ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు..
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!