చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనకు విరాట్ కోహ్లీ కూడా కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు అందింది. కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేయాలని కోరారు. ఇప్పటికే ఈ ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోషియేషన్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ పేరుతో వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఈద్-ఉల్-అఝా(బక్రీద్) పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లి సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగం, అంకితభావం, అల్లాహ్‌పై అచంచల విశ్వాసానికి ప్రతీక అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈద్-ఉల్-అఝా పండుగ మనం కలిసి జీవించడానికి, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రేరేపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ లో చికెన్ కమీషన్ కోసం ఓ మున్సిపల్ అధికారి కక్కుర్తి పడ్డాడు. చికెన్ కిలోకి రూ.5 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆళ్లగడ్డ ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ యజమానితో మున్సిపల్ అధికారి బేరసారాలు చేపట్టాడు. ప్రొద్దుటూరులో ఓ బార్ అడ్డాగా మున్సిపల్ అధికారి బేరం అడాడు. చికెన్ సెంటర్ యజమాని మహబూబ్ బాషాతో మరో షాప్ లైసెన్స్ కోసం బేరమాడిన ఆడియో వైరల్ అయ్యింది. ట్రేడ్ లైసెన్సు కావాలంటే రూ. లక్ష చెల్లించాలని డిమాండ్ చేశాడు.
చల్లపల్లి రాజా తనయుడు, మచిలీపట్నం పార్లమెంట్ మాజీ సభ్యులు శ్రీమంతురాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 86 ఏళ్లు. కోయంబత్తూరులోని స్వగృహంలో ఈరోజు కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం శనివారం కృష్ణా జిల్లా చల్లపల్లికి తీసుకురానున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు. చల్లపల్లిలోని ఎస్ఆర్వైఎస్పీ జూనియర్ కళాశాలకు అంకినీడు ప్రసాద్ కరస్పాండెంట్‌గా ఉన్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండగ జరుపుకుంటారని.. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమన్నారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో చేసుకునే బక్రీద్ అని.. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరారు..
పోలవరం, బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష జరిగిందని.. తుపాన్ బారి నుంచి పంటలు కాపాడుకునే విధంగా చర్యలు తీస్కుంటున్నామని మంత్రి రామానాయుడు అన్నారు. పంట కాలాన్ని ముందుకు తీసుకు వచ్చే చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పినట్లు తెలిపారు. నీటి లభ్యత బులెటిన్ విడుదల చేస్తామని.. పండించే పంటలకు అనుగుణంగా రైతులకు సూచనలు ఇస్తామని స్పష్టం చేశారు.
ఏపీలో 81 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సులో నిరక్షరాస్యులు ఉన్నారు. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేశ్ విస్మయం వ్యక్తం చేశారు. వయోజనా విద్యా మిషన్ తక్షణం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ‘అందరికీ విద్య (వయోజన విద్య)లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
మంత్రి నారా లోకేశ్ ప్రాతినిథ్యం వహించే మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమగ్ర తాగునీటి అభివృద్ది పథకం కోసం అదనంగా మరో రూ. 111.కోట్ల కు పైగా నిధుల విడుదలకు పరిపాలన అనుమతి లభించింది. ఈ మేరకు కేటాయింపుల వివరాలతో మున్సిపల్ శాఖ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. సురక్షిత తాగునీరు అందించే పథకం కోసం గతంలో 21 గ్రామాలకు కలిపి రూ.…
తుడా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. తుడాలో నిబంధనలకు విరుద్ధంగా ఏమి చేయడానికి వీలు ఉండదని స్పష్టం చేశారు. తుడా ఛైర్మన్ కు సంతకం పెట్టే వీలు ఉండదని.. వీసీ, సెక్రటరీ, అథారిటీ చూసుకుంటుందని వెల్లడించారు. తుడాలో గతంలో ఏ రకమైన అవినీతి జరగలేదని పునరుద్ఘాటించారు. బెంచీలు గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారన్నారు.
జనసేన నుంచి తాజాగా ఓ లేఖ విడుదలైంది. పార్టీ లైన్ దాటవద్దు అనే టైటిల్లో లేఖను సోషల్ మీడియాలో విడుదల చేసింది పార్టీ. కొందరు నేతలు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ లైన్ తప్పుతున్నారని లేఖలో పేర్కొన్నారు.