ECI Slams Rahul Gandhi: అదో చెత్త పదం.. ‘ఓట్ల చోరీ విధానం’పై స్పందించిన ఈసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ECI Slams Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇండియన్ బ్లాక్‌కి చెందిన నేతలు ఓటు చోరీ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడంపై భారత ఎన్నికల కమిషన్ (ECI) గురువారం స్పందించింది. దొంగ ఓటు అనే పదాన్ని చెత్త పదంగా అభివర్ణించింది. ఇది కోట్లాది మంది భారతీయ ఓటర్లపై ప్రత్యక్ష దాడిగా, లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది సమగ్రతపై దాడిగా ఎన్నికల సంఘం అభివర్ణించింది. 1951-52లో భారతదేశంలో జరిగిన మొదటి ఎన్నికల నుంచి “ఒక వ్యక్తి, ఒక ఓటు” చట్టం అమలులో ఉందని ఈసీఐ నొక్కి చెప్పింది. ఒక వ్యక్తి రెండుసార్లు ఓటు వేసినట్లు రుజువు ఉంటే.. ప్రమాణ స్వీకారం చేసిన అఫిడవిట్‌తో కమిషన్‌కు సమర్పించాలని పోల్ బాడీ పేర్కొంది. ఓటర్లను ఆధారాలు లేకుండా “దొంగలు” అని ముద్ర వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
దేశంలో ఓటర్ల జాబితాకు సంబంధించి రాహుల్ గురువారం ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఓట్ల చోరీ విధానం’ దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల సందర్భంగా అనేక నియోజకవర్గాల్లో కొనసాగిందని ఆయన ఆరోపించారు. దీనికి ‘మహాదేవపుర’ ఓటర్ల జాబితాయే నిదర్శనమన్నారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే లక్షకు పైగా ఓట్లు చోరీకి గురైనట్లు తేలిందన్నారు. ఈ వ్యవహారంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం అడిగినట్లుగా అఫిడవిట్ దాఖలు చేయడానికి నిరాకరించారు. తాను లేవనెత్తిన అంశాలు ఎన్నికల సంఘం స్వంత వెబ్‌సైట్లోని డేటా నుంచే వచ్చాయని.. సాక్ష్యాలు అడగడం ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నమే అని ఆయన బదులిచ్చారు.
READ MORE: No Plastic In AP Secretariat: ఏపీ సెక్రటేరియట్లో నో ప్లాస్టిక్.. ఈ నెల 18 నుంచి అమలు..
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!