Hyderabad: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ అమానుషంగా వ్యవహరించింది. విసిగిస్తున్నారని ఓ విద్యార్థిని చితకబాదింది. ఈ ఘటన తాజాగా హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్ ఎల్బీనగర్ మన్సురాబాద్ లోని బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండవ తరగతి చదువుతున్న విద్యార్థిపై టీచర్ దాడి చేసింది. విద్యార్థిని చేతిని మడచి.. కళ్ళల్లో పెన్సిల్ తో పొడిచి కొట్టింది టీచర్. విద్యార్థి మాట్లాడకుండా, ఏడవకుండా నోటికి ప్లాస్టర్ చేసింది. టీచర్ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. గత నెల రోజులుగా విద్యార్థి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఈ అంశంపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయగా, తమను ఒక గదిలో బంధించి కొట్టారని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. తమకు సైతం గాయాలైనట్లు తెలిపారు. ఈ ఘటనపై ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
READ MORE: Rahul Gandhi: రాజీవ్ గాంధీపై ‘చనిపోయిన వ్యక్తి’ పోటీ చేశారు.. రాహుల్‌గాంధీకి ఈ కథ తెలియదా..?