Hyderabad Crime: ఆయుధాలను సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. కంట్రీ మేడ్ పిస్టల్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. బీహార్ లో తయారు చేసిన ఆయుధాలను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తునట్లు గుర్తించారు. చర్లపల్లి, మల్కాజ్‌గిరి ఎస్ఒటీ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా ఈ గ్యాంగ్ గుట్టురట్టయింది. 3 పిస్టల్స్, 10 లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నారు.. బీహార్‌కి చెందిన శివ కుమార్‌ను అరెస్ట్ చేశారు.. మరో నిందితుడు బీహార్ కి చెందిన కృష్ణ పవన్ పరారీలో ఉన్నాడు..
READ MORE: Botsa Satyanarayana: పులివెందుల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసింది..
ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కొందరు గన్ ఉండటం స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారని తెలిపారు.అక్రమంగా ఆయుధాలు కొంటున్నారు.. గన్ ఉంది అని చెప్పుకోవడం.. గొప్పగా, హుందాతనం గా భావిస్తున్నారన్నారు.. ఇలాంటి వాళ్లనే టార్గెట్ చేసుకుని ఈ ముఠా పిస్టల్స్ అమ్ముదాం అనుకున్నారని చెప్పారు.. “ఆయుధాలు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ను పట్టుకున్నాం. బీహార్ కి చెందిన శివకుమార్ ను పట్టుకున్నాం.. గుజరాత్ లోని ఒక బట్టల గోదాం లో శివకుమార్ పని చేశాడు.. 2022 లో హైదరాబాద్ వచ్చాడు.. చర్లపల్లిలో గంజాయి చాక్లెట్లు అమ్ముతూ పట్టుబడ్డాడు.. ఈ మధ్య రాఖీ పౌర్ణమి సందర్భంగా బీహార్ కి వెళ్ళాడు.. కృష్ణ పవన్ అనే వ్యక్తి సలహా మేరకు కంట్రీ మేడ్ వెపన్స్ అమ్మాలి అని నిర్ణయించుకున్నారు.. 3 పిస్టల్స్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి.. కొనే పార్టీ కోసం ఎదురుచూస్తున్నారు. గన్ ఉండటం స్టేటస్ సింబల్‌గా కొందరు భావిస్తున్నారు. వారినే టార్గెట్ చేస్తున్నారు.” అని సీపీ వెల్లడించారు.
READ MORE: Supreme Court : ఈ నెల 19లోగా ఓట్లు తొలగించిన వారి జాబితా ఇవ్వాలన్న సుప్రీంకోర్టు.