బీజాపూర్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో తెలంగాణకు చెందిన మరొక కీలక నేత మృతి చెందినట్లు సమాచారం. కేంద్ర కమిటీతోపాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా ఉన్న మావోయిస్టు నేత మృతి చెందినట్లు తెలుస్తోంది. నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య మళ్ళీ భీకర ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మరో నక్సల్ నాయకుడు హతమైనట్లు చెబుతున్నారు.
ఎన్నికల ముందు 143 వాగ్దానాలతో పాటు ఈవీఎంలను లోబర్చుకుని చంద్రబాబు గెలిచారని, గెలిచి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ ఆరోపించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం రోజు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు పైకి వచ్చారని చెప్పారు. ప్రతి కార్యక్రమంలో జగన్ని నిందిస్తున్నారని.. అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని.. దిగజారుడు మాటలు మాట్లాడటానికి సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దళితులకు ఈ…
తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి. స్థానిక ఇంద్ర ప్రియదర్శిని కూరగాయలు మార్కెట్లో మత్తు ఎక్కించే ఇంజక్షన్లు వీడియో వైరల్ అవుతోంది. ఇంజక్షన్ లను తీసుకునే సమయంలో యువకులు వీడియో తీశారు. కూరగాయల మార్కెట్ లో తరచూ మత్తులో ఉంటూ యువకులు హల్ చల్ సృష్టిస్తున్నారు. తిరుపతి నగరంలో విచ్చలవిడిగా మత్తు పదార్థాల వినియోగం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. యువత స్వయంగా మత్తు ఇంజక్షన్లు వేసుకుంటున్నారని వెల్లడిస్తున్నారు.
తొక్కిసలాట ఘటనపై బెంగుళూరు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తొక్కిసలాట గాయపడిన బాధితుడు ఫిర్యాదు మేరకు నమోదు చేశారు. ఆర్సీబీ ఎక్స్ చేసిన పోస్టు చూసి తాను ర్యాలీ కి వచ్చి గాయపడ్డానని ఆర్సీబీ ఫ్యాన్ అయిన బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి తప్పులకు తాను ఇబ్బందులు పడాల్సి వచ్చిందని.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదైంది.
నిన్న ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన నారాయణరెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో పరువు పోయిందని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
వైసీపీ పై భూమా అఖిల ఫైర్ అయ్యారు.. వైసీపీ వెన్నుపోటు దినంతో ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. తాజాగా నంద్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. "వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు... మద్య నిషేధం పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారు... వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత సోదరికి వెన్నుపోటు పొడిచారు.. సొంత చెల్లిని, తల్లిని బయటికి గెంటేసి జగన్ వారికి వెన్నుపోటు పొడిచారు.. రైతులకు, రాష్ట్రానికి ప్రజలకు వెన్నుపోటు పొడిచింది వైసీపీ నాయకులే..…
టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్యకు కుట్రలో ట్విస్ట్ నెలకొంది. అనంతపురం డీఎస్పీ ఆఫీసులో టీడీపీ నేత సుధాకర్ నాయుడు ప్రత్యక్షమయ్యారు. ఉదయం నుంచి సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర అని జోరుగా ప్రచారం జరిగింది. కానీ.. ఆయన విచారణ నిమిత్తం డిఎస్పీ ఆఫీస్కు వచ్చారు. దాదాపు గంటన్నర పాటు సుధాకర్ నాయుడును డిఎస్పీ శ్రీనివాసులు విచారించారు. విచారణ అనంతరం మీడియాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు.
పొగాకు కొనుగోలు విషయంలో రైతులకు ఆందోళన వద్దని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన 25 మిలియన్ కేజీల పొగాకు ప్రభుత్వం మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డ్ ల నుంచి పొగాకు కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులు నల్లబెల్లి పొగాకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకి, బిజు జనతాదళ్ సీనియర్ నాయకుడు (బీజేడీ) పినాకి మిశ్రాతో వివాహం జరిగింది. మొయిత్రా, మిశ్రా 14 రోజుల క్రితం బెర్లిన్లో వివాహం చేసుకున్నారని ఓ టీఎంసీ సీనియర్ నాయకుడు జాతీయ మీడియాకు వెల్లడించారు. ఈ అంశంపై సదరు మీడియా సంస్థ ప్రతినిధి మొయిత్రా సంప్రదించినప్పుడు ఆమె స్పందించలేదు. అయితే.. ఈ వదంతుల మధ్య తాజాగా ఎంపీ మహువా మొయిత్రా అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. 65 ఏళ్ల పినాకి మిశ్రాతో…
పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని.. ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మాజీ ప్రభుత్వ విప్, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది కిందట ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి ద్వారా ఎనిమిది కోట్లు పట్టుకున్నట్టు తెలిసిందని.. తనిఖీల్లో 8 కోట్ల రూపాయలు దొరికితే, దానికి అన్ని ఆధారాలు సమర్పించారన్నారు.