Monsoon Diet: వర్షాకాలం మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ సీజన్‌లో జనాలు అధికంగా వ్యాధుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు తరచూ జబ్బుపడుతుంటారు. వారికి మంచి ఇమ్యూనిటీ పవర్ అవసరం అందుకే కింద పేర్కొన్న ఈ ఆహారపదార్థాలను తినడం వల్ల అనే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంతకీ ఏం తినాలి? అవి తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు చూద్దాం…
READ MORE: UPix Creations Scam: హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ పేరుతో 201 కోట్లు కొట్టేసిన ముగ్గురు అరెస్ట్
పచ్చిమిరియాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పైపైరిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది గణనీయంగా విటమిన్ సి, విటమిన్ కెలను అందిస్తుంది. పచ్చిమిరియాలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వ్యాధులను నిరోధిస్తాయి. పచ్చిమిరియాలు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తిని ఉత్తేజపరుస్తాయి. ఇవి ఆహార జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇవి యాంటీమైక్రోబియల్ లక్షణాలను కూడా కలిగిఉంటాయి. దీంతో ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలకు కారణమైన బ్యాక్టీరియాను తొలగిస్తాయి. దీంతో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాన్ని తగ్గిస్తాయి. వర్షాకాలంలో ఎక్కువగా సీజనల్ పండ్లు అంటే బొప్పాయి, నేరేడు, చెర్రీలు, దానిమ్మ, పీచెస్ వంటివి తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ సీజన్‌లో రోడ్డు పక్కన ముందస్తుగా కట్ చేయబడ్డ పండ్లు, జ్యూస్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోరాదు. నాణ్యమైన తాజా పండ్లను తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు.
READ MORE: ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లో లోతట్టు ప్రాంతాలు జలమయం,రోడ్లపైకి చేరిన వరద.
వర్షాకాలంలో సూప్, మసాలా టీ, గ్రీన్ టీ వంటి వెచ్చగా ఉండే ద్రవాలను పుష్కలంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి రీహైడ్రేషన్‌కు మంచివి. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తాయి. హెర్బల్ టీ లేదా కషాయాలను తాగడం ద్వారా మీ రోగనిరోధక శక్తి మరింత శక్తివంతంగా మెరుగుపడుతుంది. దీని కోసం పసుపు, తులసి, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, నల్ల ఉప్పును నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిలో నిమ్మరసం, తేనె కలుపుకోని తాగితే చాలా రకాల వ్యాధులను అరికట్టవచ్చు. పొట్లకాయ, సొరకాయ వంటి సీజనల్ కూరగాయలతో పాటు పుల్లగా ఉండే ఏ కూరగాయలనైనా తినవచ్చు. అంతేకాకుండా కూరగాయలతో తయారుచేసుకున్న సూప్, పరాఠా, రైతా లాంటివి ఆరగించవచ్చు. అయితే పచ్చికూరగాయలు కాకుండా ఉడకబెట్టినవి మాత్రమే తినాలి. ఎందుకంటే పచ్చి కూరగాయలలో బ్యాక్టీరియాతో పాటు వైరస్ ఉంటుంది. అవి మీ అనారోగ్యానికి కారణమయ్యే అవకాశముంది. మీ ఆహారంలో మెంతి, వేప, వంటి వాటిని చేర్చండి. ఇది మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కాలానుగుణ అంటువ్యాధుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్లు ఎ, సి, బి, ఖనిజాలు, ఇనుము, జింక్ పోషకాలు ఉంటాయి. వేపలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్లక్షణాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
READ MORE: Coolie : కూలీలో తన రెమ్యునరేషన్ చెప్పిన అమీర్ ఖాన్..
వెల్లుల్లి అనేది జీవక్రియను పెంచడానికి ఉపయోగించే సూపర్ ఫుడ్. మీరు దీనిని పప్పు, సాంబార్, రసం, అనేక ఇతర విషయాలలో ఉపయోగించవచ్చు. మీరు వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, పసుపును ఆహారంలో ఉపయోగించవచ్చు. ఇవి జలుబు, ఫ్లూ వంటి వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయి. నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మకాయల్లో ఉన్న ‘విటమిన్ సీ’ అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తూ కవచంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా అమితంగా పెరుగుతుంది. పసుపును క్రమం తప్పకుండా ఆహారంలో, పాలతో తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడటంతోపాటు.. మానసిక స్థితిని అదుపులో ఉండేలా చేస్తుంది. పసుపు వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పెరుగులో ప్రోబయోటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉన్న మంచి బ్యాక్టీరియా పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తవేసవి కాలం తరహాలోనే వర్షాకాలం సీజన్‌లోనూ తగినంత నీరు తాగాలి. నీరు శరీరంలో శక్తిని పెంచుతుంది. ఇది కాకుండా మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. మీరు నిమ్మ, నారింజ, దోసకాయ, పుదీనాను నీటిలో కలుపుకొని డిటాక్స్ పానీయంగా తాగవచ్చు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.