Medak ATM Robbery Attempt: ముగ్గురు దోస్తుల మాస్టర్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఈజీ మనీకి అలవాటు పడి బ్యాంకులు, ఏటీఎంలను లక్ష్యంగా చోరీలు చేశారు ముగ్గురు ఆప్తమిత్రులు.. ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. బ్యాంకుల్లో దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నారు. నిందితులు ముగ్గురు కూడా 28 ఏళ్ల లోపు యువకులే. గుమ్మడిదలలో HDFC ATM, వెల్దుర్తిలో సెంట్రల్ బ్యాంక్, మెదక్‌లో SBI ATMలలో చోరీకి యత్నించారు. ఏటీఎం మెషిన్‌లను ఎత్తుకెళ్లేందుకు ఓ ట్రాక్టర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు కేటుగాళ్ళు. కొన్ని సార్లు వైన్స్‌లలో మద్యం బాటిళ్లు సైతం చోరీ చేసి అమ్ముకున్నట్టు పోలీసులు గుర్తించారు.
READ MORE: Coolie : అమీర్ ఖాన్, నాగార్జునను డామినేట్ చేసిన చిన్న నటుడు..
ఈ నిందితులను మెదక్ జిల్లా మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్(24), లింగం(28), ప్రసాద్(20)లుగా పోలీసుల గుర్తించారు. వారిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి తాగడానికి దాచుకున్న మద్యం బాటిళ్లు, చోరీకి ఉపయోగించే తాడు, సుత్తి, ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు ఎస్పీ శ్రీనివాసరావు.. నిందితులు ముగ్గురూ స్నేహితులేనని.. ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలావాటు పడ్డట్టు చెప్పారు. “యూట్యూబ్‌లో వీడియోలు చూసి బ్యాంకులు, ఏటీఎంలలో దొంగతనాలు చేశారు. పులువురు బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశాం. సీసీటీవీ ఫుటేజీలు, పలు ఆధారాల సాయంతో నిందితులు మానేపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించాం. పోలీసులు ఆ గ్రామానికి వెళ్లగా శివారులో వీళ్లు కనిపించారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నాం.” అని ఎస్పీ వెల్లడించారు.
READ MORE: Monsoon Diet: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి…