ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో ఉన్నారు. సివాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ వేదిక నుంచి పునాది వేశామని ప్రధాని మోడీ అన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్‌ను ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగు పరుస్తాయన్నారు. పేదరికాన్ని తగ్గించవచ్చని తాము చూపించామని, ప్రపంచ బ్యాంకు సైతం భారతదేశానికి అభిమానిగా మారిందని మోడీ అన్నారు.
రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రేమికుడు తన ప్రియురాలిని చంపి భూమిలో పాతిపెట్టాడు. 5 రోజులుగా కనిపించకుండా పోయిన ప్రియురాలి మృతదేహం ప్రియుడి ఇంటికి కొద్ది దూరంలో లభించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ యువకుడు సోషల్ మీడియాలో ఓ అమ్మాయితో స్నేహం చేశాడు. తాను హిందువు అని చెప్పుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయి మతం, నిజస్వరూపం గురించి తెలుసుకుంది. ఈ విషయం బయటకు చెబితే.. ఆమెను, ఆమె కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు.
మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన జరగనుంది. జూన్ 20–21 తేదీల్లో బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. బీహార్‌లోని సివాన్ జిల్లాలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు రూ. 400 కోట్ల విలువైన వైశాలీ–దియోరియా రైలు మార్గం ప్రారంభిస్తారు.
ప్రయాణికుల భద్రతే భద్రతే మాకు ప్రథమ కర్తవ్యమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ పేరుతో తమ వినియోగదారులకు లేఖ రాశారు. ఇందులో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదంపై స్పందించారు. అహ్మదాబాద్ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని.. కింద భవనంలో ఉన్న 34 మంది పౌరులూ ప్రమాదంలో మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పరస్పరం బాంబుల మోత మోగిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇప్పటికే ఇరుదేశాల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్‌లోని సోరోకా హాస్పిటల్, స్టాక్ ఎక్స్ఛేంజ్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్ జిల్లాలోని సిటీ కొత్వాలి ప్రాంతం సారవా గ్రామంలో ఓ నూతన వివాహిత తన ప్రియుడితో కలిసి పారిపోయింది. వివాహం జరిగిన దాదాపు 50 రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్య లక్షల విలువైన నగలు, నగదుతో పారిపోయిందని భర్త ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నూతన వివాహితను పట్టుకున్నారు. ఆమెను కుటుంబీకులకు అప్పగించారు.
కొద్ది రోజుల కిందట సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె ఢిల్లీలోని గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. ఈరోజు గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
2017లో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. పోలీసు ఎన్కౌంటర్ కేసులు పెరిగాయి. రాష్ట్రంలోని చాలా మంది ప్రమాదకరమైన నేరస్థులు పోలీసు ఎన్కౌంటర్లలో మరణించారు. పెద్ద సంఖ్యలో నేరస్థులు గాయపడ్డారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జూన్ 19న తన 55వ పుట్టినరోజును అత్యంత సరళంగా జరుపుకున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడి, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరిన కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నారు. రాహుల్ తన నివాసం 24 అక్బర్ రోడ్లో కార్యకర్తలు, నాయకులను కలిశారు. అక్కడ వాళ్లు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేయడానికి నిరాకరించారు.