క్వారీ యజమాని మనోజ్ రెడ్డి బెదిరింపు కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాజీపేట లోని రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్ విధించారు. కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్ట భద్రత నడుమ కౌశిక్ రెడ్డిని ఖమ్మం తరలించనున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పిఎస్ దగ్గర హైడ్రామా కొనసాగతోంది.
ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 168 మంది ప్రయాణికులతో గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కెఐఎ)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సరిపడ ఇంధనం లేకపోకపోవడంతో కెప్టెన్ 'మేడే కాల్' చేశాడు. దీంతో విమానం బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకోగా.. తాజాగా బయటకు వచ్చింది.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. కోర్టులో హాజరుపరచే ముందు.. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించారు. ఆస్పత్రిలోకి వెళ్లే ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు.. ఈ కాంగ్రెస్ సర్కార్ 20% కమీషన్ సర్కార్.. పోలీస్ ఆఫీసర్ల దగ్గర కమీషన్స్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే నాగరాజు.. అక్రమ మైనింగ్ చేస్తున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోకపోవడం హాస్యస్పదం.." అని వ్యాఖ్యానించారు. అంతలోపే పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని…
బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ వర్సిటీ ఉపకులపతి కె.ప్రతాప్‌రెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. 32,106 మంది ఎడ్‌సెట్ పరీక్ష రాయగా 30,944 మంది ఉత్తీర్ణత నమోదైంది. అంటే 96.38శాతం అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. మొదటి మూడు స్థానాల్లో అబ్బాయిలదే హవా.
పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి వాదీ ఏ ముస్తఫా నగర్‌లోని పెళ్లిళ్లకు డెకరేషన్ చేసే గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక దళానికి వారికి సమాచారం చేరవేశారు.
డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మే మాసంలో 4021 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు మంజూరు చేసింది. డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ.2016 మంజూరు చేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ హయంలో కేవలం 4011 మందికి మాత్రమే డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పింఛన్ వచ్చేదని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఒక్క మే మాసంలోనే అంతకు మంచి పెన్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొంది. మంత్రి సీతక్క చొరవతో నూతన లబ్ధిదారుల ఎంపిక జరిగింది.
పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బై బ్యాక్ పాలసీ ద్వారా అనతి కాలంలోనే ఒకటికి రెండింతలు డబ్బులు ఇస్తామంటూ చెప్పి బాధితులను నట్టేటా ముంచేశారు. ఏవీ ఇన్ఫ్రాకాన్ పేరిట ఈ భారీ మోసం చేశారు.
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఆమె ఖండించారు. మోడీ ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో భారత్ మౌనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇది గొంతు కోల్పోవడం కాదు.. విలువల సర్పణ” అని ఆమె పేర్కొన్నారు. భారత్ చారిత్రక నైతిక స్థైర్యాన్ని కోల్పోయిందని.. మానవ హక్కుల ఉల్లంఘనలపై మౌనం బాధాకరమన్నారు.
బరువు తగ్గడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా సులభమైన ఆహార ప్రణాళికలను కనుగొంటారు. ఈ ఐదు సూత్రాలు పాటించి బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషక విలువలు, శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉంటాయి. ప్రతి కూరగాయలో శరీరానికి, ఆరోగ్యానికి మంచి చేసే అనేక విటమిన్లు, శక్తిని అందించే పదార్థాలు ఉంటాయి. కూరగాయలను తినడం ద్వారా శరీరానికి బలంతో పాటు పౌష్టిక విలువలు లభిస్తాయి. అలా మనకు లభించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి.