ఈ ఏడాదిలో చివరి సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రోజు ఏర్పడనుంది. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది. జ్యోతిషశాస్త్రం, ఖగోళ శాస్త్రం రెండింటిలోనూ దీన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. పంచాంగం ప్రకారం.. చంద్రగ్రహణం రాత్రి 9:58 గంటలకు ప్రారంభమవుతుంది. దీని మధ్య కాలం రాత్రి 11:41 గంటలకు ఉంటుంది. ఇది రాత్రి 01:27 గంటలకు ముగుస్తుంది. ఈ విధంగా, ఈ గ్రహణం మొత్తం 3 గంటల 28 నిమిషాల పాటు కొనసాగుతుంది. సుతక్ కాలం మధ్యాహ్నం 12:58 గంటలకు ప్రారంభమైంది. ఈ సమయంలో, ఏదైనా శుభ కార్యం, ప్రయాణం, మతపరమైన కార్యక్రమం లేదా ఆహారం వండటం మంచిది కాదని చెబుతారు. సుతక్ కాల సమయంలో అన్ని దేవాలయాలు మూతపడతాయి.
READ MORE: Pizza: “పిజ్జా”కు యుద్ధానికి సంబంధం ఏమిటి.. అమెరికాలో ఏం జరుగుతోంది..?
అయితే.. చంద్రగ్రహణం ఏయే ప్రాతాల్లో కనిపిస్తుంది? అనే ప్రశ్న అందరి మదిలో ఉత్పన్నమవుతోంది.
ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్‌లో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే భారత్‌లోని అన్ని ప్రాంతాల్లో కాకుండా ముఖ్యంగా నాలుగు ప్రదేశాల్లో చంద్ర గ్రహణం చాలా క్లియర్‌గా కనిపిస్తుందట. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో చంద్ర గ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రదేశాలతో పాటు అహ్మదాబాద్, పూణే, లక్నో వంటి భారతీయ నగరాలు కూడా అద్భుతమైన వ్యూ పాయింట్‌లను అందిస్తాయని స్పష్టం చేశారు.
READ MORE: Late Night Sleep Problems: కొంచెం తొందరగా నిద్రపోండి గురూ… లేట్ నిద్రతో ఎన్ని సమస్యలో తెలుసా!