Karur TVK Rally Stampede: తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ నేతృత్వంలో జరిగిన మెగా రాజకీయ ర్యాలీకి వేలాది మంది తరలివచ్చారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. కనీసం 31 మంది మరణించారని సమాచారం. హాజరైన వారిలో చాలా మంది కుప్పకూలిపోయారని తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో విజయ్ తన ప్రసంగాన్ని అకస్మాత్తుగా ముగించారు. “పోలీసులు, దయచేసి సహాయం చేయండి” అని మైక్‌లో చెప్పడం వినిపించింది. స్పృహ తప్పిన వారి కోసం బస్సుపై నుంచి విజయ్ వాటర్ బాటిళ్లను విసిరారు. అనంతరం వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ర్యాలీ నిర్వాహకులు ఊపిరాడక బాధపడుతున్న ప్రజలకు నీటిని పంపిణీ చేశారు. అంబులెన్స్‌లను ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించారు.
READ MORE: Karur TVK Rally Stampede: విజయ్ ర్యాలీలో 30 మందికి పైగా మృతి.. స్పందించిన సీఎం స్టాలిన్..
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. “తమిళనాడులోని కరూర్‌లో జరిగిన రాజకీయ ర్యాలీలో జరిగిన దురదృష్టకర సంఘటన తీవ్ర బాధాకరం. తమ బంధుబలగాన్ని కోల్పోయిన వారికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి బలాన్ని అందిచాలని.. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. తొక్కిసలాట తర్వాత కనీసం 31 మంది చనిపోయి ఉంటారని, ఆరుగురు పిల్లలు, 16 మంది మహిళలు సహా 40 మంది ఆసుపత్రి పాలయ్యారని తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ తెలినట్లు సమాచారం.
READ MORE: IND vs PAK Final: విజేతకు ట్రోఫీ అందిస్తా.. పీసీబీ చీఫ్ అత్యుత్సాహంపై బీసీసీఐ రియాక్షన్ ఏంటో?