ఛత్తీస్‌గఢ్‌లోని ఓ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్చరించారు. ఈ అంశంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాయ్‌పూర్‌లోని సైన్స్ గ్రౌండ్లో జరిగిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఖర్గే రాష్ట్రపతిని 'ముర్మా జీ' అని ఉచ్చరించారు. అయితే.. ఆయన వెంటనే సరిదిద్దుకుని 'ముర్ము' అని పలికారు. కొన్ని సెకన్ల తర్వాత.. మళ్ళీ మాజీ రాష్ట్రపతి పేరును తప్పుగా…
జపాన్, దక్షిణ కొరియాతో సహా 14 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించారు. దీని ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ పతనం రూపంలో కనిపించింది. మరోవైపు, ట్రంప్‌తో కొనసాగుతున్న వివాదం, కొత్త రాజకీయ పార్టీ ప్రకటనతో ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత 24 గంటల్లో, మస్క్ కంపెనీ టెస్లా స్టాక్ క్రాష్ అయ్యింది. దీని కారణంగా 15.3 బిలియన్ డాలర్లు (రూ. 1.31 లక్షల కోట్లకు పైగా) నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత కొన్ని రోజులుగా, ఎలాన్ మస్క్ నికర విలువ…
కొత్త అధ్యక్షుడిని డమ్మీ డమ్మీ అని అందరన్నారని.. తాను డమ్మిని కాదు మమ్మీకి డాడీని అన్న రామ్ చందర్ రావుకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానన ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. డమ్మీ కాదని నిరూపించుకునేందుకు రామ్ చందర్ రావుకు ఇది మంచి అవకాశమన్నారు. ఫాతిమా కాలేజ్ పై లీగల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని.. లీగల్ టీమ్ తో హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసీ ఫాతిమా కాలేజ్ కూల్చేందుకు కొట్లాడాలని తెలిపారు. హైడ్రా వల్ల అనేక పేద కుటుంబాలు రోడ్ల పాలయ్యాయని.. పేదలకు ఒక…
నిద్రలో కలలు రావడం ప్రతి ఒకరిలో సాధారణంగానే జరుగుతుంటుంది. అయితే మంచి కలల వల్ల ప్రశాంతంగా నిద్రపోతారు. కానీ పీడ కలలు లేదా భయానక స్వప్నాలు రావడం చెడు అనుభవాన్ని కలిగిస్తాయి. దీని వల్ల భయంతో నిద్రలో నుంచి హఠాత్తుగా మెలకువ వస్తుంది. సాధారణమైన కలల్లో వ్యక్తులు ప్రపంచాన్ని చుట్టి వస్తారు. కానీ పీడ కలల్లో మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాకుండా ఇలాంటి కలల వల్ల అనారోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్థాన్‌కు సైనిక మద్దతు ఇచ్చిందా? అనే ప్రశ్నపై చైనా ప్రభుత్వం స్పందించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్‌కు సైనిక మద్దతు అందించిందని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ ఇటీవల పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని చైనా తన అనేక రక్షణ వ్యవస్థలను పరీక్షించడానికి 'లైవ్ ల్యాబ్'గా ఉపయోగించుకుందని అన్నారు.
అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను లారీ ఢీకొట్టింది. భార్యాభర్తలు స్పాట్లోనే మృతి చెందారు. తూప్రాన్ పేట్ కు చెందిన భార్యాభర్తలు వెంకటేష్, లక్షీగా పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలంలో ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాలను పోస్టు మర్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను కన్వీనర్, సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన, ఐఏఎస్ విడుదల చేశారు. సర్టిఫికెట్ల పరిశీలనకు చివరి తేదీ జూలై 8 కాగా.. జూలై 6 నుంచి10 వరకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటివరకు 95,654 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోగా, 76,494 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. మొత్తం 21 యూనివర్సిటీ, కాన్స్టిట్యూయెంట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో…
మధ్యప్రదేశ్ లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 12 సంవత్సరాలుగా డ్యూటీ చేయకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్న కానిస్టేబుల్ ఉదంతం బయటపడింది. ఈ కేసు 2011లో నియమితులైన విదిష జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారిది. నియామకం తర్వాత.. అతన్ని భోపాల్ పోలీస్ లైన్లో పోస్టింగ్ ఇచ్చారు. ఆపై సాగర్ శిక్షణా కేంద్రానికి పంపారు. కానీ శిక్షణకు హాజరు కావడానికి బదులుగా, అతను విదిషలోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఏ అధికారికి సమాచారం ఇవ్వలేదు లేదా సెలవు కోసం దరఖాస్తు…
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (మం) మండలం ఏక్మైఈ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించొద్దని మందలించినందుకు మైనర్ బాలుడు ఓవ్యక్తిపై కొడవలితో దాడి చేశారు. ఓ మైనర్ బాలుడికి మద్యం తాగొద్దని గ్రామానికి చెందిన మారెప్ప అనే వ్యక్తి మందలించారు. మారెప్పపై కక్ష పెంచుకున్న బాలుడు కొడవలితో దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పక్కా ప్లాన్ తో కొడవలితో దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఫాల్కన్ గ్రూప్ సీఓఓ(చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) ఆర్యన్ సింగ్ అరెస్ట్ అయ్యాడు.. ఆర్యన్ సింగ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాల్కన్ పెంపెనీ 7056 డిపాజిట్‌దారుల నుంచి రూ. 4215 కోట్లు వసూలు చేసింది. డిపాజిట్‌దారులకు రూ. 792 కోట్ల మోసానికి పాల్పడింది. చిన్న మొత్తంలో పెట్టుబడులకు భారీ లాభం అంటూ మోసం చేసింది.