Balakrishna: ఏపీ బ్రాండ్ సీఎం చంద్రబాబు అని హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయన్నారు. అందుకే చంద్రబాబు 24 గంటలు పనిచేస్తున్నారని తెలిపారు. తాజాగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం దేశ పటంలోనే సువర్ణ అక్షరాలతో లికించబడుతుందని కొనియాడారు. ఆధ్యాత్మికం, పర్యాటకం మిళితమైన కార్యక్రమని.. దుర్గమ్మ ఆశీస్సులు, కటాక్షం అందరిపై ఉండాలన్నారు. 46 రోజులపాటు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని.. 11 రోజులు దుర్గమ్మను వివిధ రూపాల్లో అలంకరిస్తారని చెప్పారు. కళకు చావు లేదు. కలలను నేటి తరానికి చాటి చెప్పాలన్నారు. కూచిపూడి, తోలుబోమ్మలు కృష్ణ జిల్లాలో ప్రాచుర్యం పొందాయని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. సినిమాలకు రాజధాని విజయవాడ.. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో మంది ఇక్కడ వారు తోడ్పడ్డారని చెప్పారు. అనంతరం బసవతారకం ఆసుపత్రిపై మాట్లాడారు. బసవతారకం హాస్పటల్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. అమరావతిలో నిర్మించే హాస్పటల్ ను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
READ MORE: Netanyahu: అరబ్ దేశాలకు యూఏఈ షాక్.. నెతన్యాహూతో మీటింగ్..