Cough Syrup: రాజస్థాన్‌లో దగ్గు సిరప్ తీసుకున్న పిల్లల ఆరోగ్యం క్షీణిస్తోంది. సికార్‌లో ఐదేళ్ల చిన్నారి మరణించింది. ఆ సిరప్ తీసుకున్న వెంటనే ఆ చిన్నారి శ్వాస ఆగిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జైపూర్‌లో ఇలాంటి కేసు వెలుగులోకి రాగా, శ్రీమధోపూర్, భరత్‌పూర్‌లలో కూడా సంఘటనలు నమోదయ్యాయి. జైపూర్‌లో అదే మందు తీసుకున్న రెండేళ్ల బాలికను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసియులో చేర్చాల్సి వచ్చింది.
READ MORE: Pakistan Foreign Loans: ప్రపంచ దేశాలకు వంగి వంగి దండాలు పెడుతున్న పాక్.. దాని కోసమేనా?
ఈ సిరప్ పేరు డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్. ఈ ఔషధాన్ని సేవించిన తర్వాత.. సికార్, భరత్‌పూర్‌లలో ఇద్దరు పిల్లలు మరణించారని చెబుతున్నారు. ఈ మందు జూన్‌లో సరఫరాలోకి వచ్చింది. ఈ ఔషధాన్ని స్థానిక జైపూర్ కంపెనీ కేసన్స్ ఫార్మా తయారు చేస్తుంది. ఈ సంఘటన తర్వాత, రాజస్థాన్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఔషధ సరఫరాను నిలిపివేసింది. ఔషధ విభాగం పరీక్ష కోసం నమూనాలను సేకరించింది. ఐదు నుంచి ఆరు రోజుల్లో వివరణాత్మక దర్యాప్తు నివేదిక వెలువడే అవకాశం ఉంది.
READ MORE: Piyush Goyal: చంద్రబాబు మా పెద్దన్న.. కేంద్రమంత్రి గోయల్ కీలక వ్యాఖ్యలు..
భరత్‌పూర్, సికార్, మరికొన్ని జిల్లాల్లో ఇటువంటి కేసులు నమోదయ్యాయని డ్రగ్ కంట్రోలర్ అజయ్ ఫాటక్ తెలిపారు. ఈ మందు నమూనాలను పరీక్ష కోసం పంపామని వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ మందు పిల్లలకు కాదు, పెద్దలకు మాత్రమే అని తేలిందన్నారు. ఆశ్చర్యకరంగ భరత్‌పూర్‌లోని ఒక ప్రభుత్వ వైద్యుడు కూడా ఈ మందుకు బలయ్యాడు. తీసుకున్న కొన్ని గంటల్లోనే అతని ఆరోగ్యం క్షీణించింది.