Lovers Suicide: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు… కలిసి బతకాలనుకున్నారు… పెద్దలకు చెబితే ఒప్పుకోరని భావించారు… ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని పోలీసులను ఆశ్రయించారు… పోలీసులు ఇరు వైపులా తల్లితండ్రులకు నచ్చచెప్పినా వినిపించుకోలేదు… మీ బతుకు మీరు బతకండంటూ వెళ్లిపోయారు… దీంతో మనస్తాపానికి గురైన ఆ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు.
READ MORE: Off The Record: తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయా? ఆగుతాయా?
ఈ ఫొటోలో కనిపిస్తున్న వారి పేర్లు గోపి, లక్ష్మి ప్రియాంక. గోపిది పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు. లక్ష్మిప్రియాంకది తెనాలి రూరల్ మండలం అత్తోట. వీరిద్దరూ మేడికొండూరు సమీపంలోని NRI ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. కాలేజీలో ఇద్దరికి ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఒకరిని విడిచి మరొకరు బతకలేమని భావించారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే పెద్దలు ప్రేమ వివాహానికి అంగీకరిస్తారో…లేదో అన్న అనుమానం ఇద్దరిలో ఉంది. చివరకు పెద్దలు ఒప్పుకోరని భావించి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత సెప్టెంబర్ 5న గుంటూరు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు. తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, తమకు పెద్దలనుంచి రక్షణ కల్పించాలని కోరారు. దీంతో పట్టాభిపురం పోలీసులు గోపి, లక్ష్మి ప్రియాంక తల్లితండ్రులను పిలిపించారు. అయితే స్టేషన్‌కు వచ్చిన ఇరువైపుల పెద్దలు తమకు చెప్పకుండా ఎలా పెళ్లి చేసుకుంటారంటూ ప్రేమికులపై మండిపడ్డారు. పోలీసులు ఎంత సర్దిచెప్పినా శాంతించలేదు. ఇద్దరూ మేజర్లు కావడంతో చేసేదేమీలేక మీతో మాకు సంబంధం లేదని తేల్చిచెప్పి ఇరువైపుల పెద్దలు వెళ్లిపోయారు…
READ MORE: Jagtial: ప్రాణం తీసిన ప్రేమ.. యువకుడిని కొట్టి చంపిన ప్రియురాలి కుటుంబీకులు..!
పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో గోపి, లక్ష్మిప్రియాంక మనస్తాపానికి గురయ్యారు. చేసేదేమీలేక పేరేచెర్లలో ఎవరి హాస్టల్స్‌కు వారు వెళ్లారు. అయితే పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదన్న బాధ ఇద్దరిలోనూ పెరిగిపోయింది. ఇరవై రోజులపాటు తల్లితండ్రుల తీరుపై తీవ్ర వేదన అనుభవించారు. ఈ క్రమంలో గోపి… పేరేచెర్ల శివారులో రైల్వేట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మిప్రియాంక మానసికంగా కుంగిపోయింది. మరుసటిరోజు గోపి ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశంలోనే తాను కూడా రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం రైల్వే పోలీసులు నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడకు వచ్చిన లక్ష్మిప్రియాంక తల్లితండ్రులు తమ కూతురు మృతదేహం తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో గోపి తల్లితండ్రులే ఇద్దరి మృతదేహాలను తమ గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారన్న కోపంతో తల్లితండ్రులు అన్న మాటలను సీరియస్‌గా తీసుకుని ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.