Trump:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం అనేక ముఖ్యమైన ప్రకటనలతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తాను నోబెల్ శాంతి బహుమతిని కోరుకోవడం లేదని, గాజా వివాదానికి శాశ్వత శాంతిని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ట్రంప్ అన్నారు. గాజా వివాదం కోసం తన కాల్పుల విరమణ ప్రతిపాదన దాదాపుగా ఖరారు అయిందని పేర్కొన్నారు. “మధ్యప్రాచ్యం మొత్తం సంతకం చేయమని మేము కోరుతున్నాం. ఇది అసాధ్యమైన పని, కానీ అది పూర్తయింది. ఇప్పుడు మనం హమాస్ కోసం వేచి ఉండాలి. వారు సంతకం చేయకపోతే, పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి” అని ట్రంప్ తెలిపారు.
READ MORE: Oppo A6 5G: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. ఒప్పో కొత్త ఫోన్ విడుదల..
హమాస్ కు మూడు నుంచి నాలుగు రోజుల సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. ఒకవేళ వారు నిరాకరిస్తే, ఇజ్రాయెల్ కు “ఏది కావాలంటే అది చేసుకునేందుకు” స్వేచ్ఛ ఇస్తానన్నారు. “హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరించకపోతే, వారు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. మేము 25,000 మందికి పైగా హమాస్ ఉగ్రవాదులను చంపి, వారి నాయకత్వాన్ని మూడుసార్లు నిర్మూలించాం. ఇప్పుడు, వారు శాంతిని కోరుకుంటే మంచిది.. లేకుంటే పరిస్థితులు మరింత దిగజారిపోతాయి” అని ట్రంప్ హెచ్చరించారు. రష్యా గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ఇటీవల మాస్కో అమెరికాను బెదిరించిందని.. ప్రతి స్పందనగా రష్యా తీరంలో రెండు అణు జలాంతర్గాములు మోహరించినట్లు తెలిపారు. అణ్వాయుధాలను ఉపయోగించాల్సి వస్తే, తమ దగ్గర ఇతర దేశాల కన్నా అధికంగా ఉన్నాయని తెలిపారు.
READ MORE: 1020 Movies Hacked: ఇదేం కిక్ రా స్వామీ.. కిక్ కోసం ఇంత పని చేస్తావా బాబు?